Preetham Jukalker: నాగ చైత‌న్య మౌనం బాధ‌ను క‌లిగిస్తుంది.. మాట్లాడాలి అంటున్న సమంత స్టైలిస్ట్

Preetham Jukalker: అక్టోబ‌ర్ 2న స‌మంత‌- నాగ చైత‌న్య విడాకులు తీసుకున్న విష‌యం తెలిసిందే. అన్యోన్యంగా ఉన్న జంట స‌డెన్‌గా విడాకులు తీసుకోవ‌డంపై అంతా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. వీరు విడిపోవ‌డానికి కార‌ణం ఏమై ఉంటుందా అని ఆరాలు తీస్తున్నారు. ముఖ్యంగా సమంత ఓ ఎఫైర్ పెట్టుకుందంటూ మరీ దారణంగా రూమర్లు పుట్టుకొస్తున్నాయి. సమంత వద్ద స్టయిలిస్ట్ గా పనిచేస్తున్న ప్రీతమ్ జుకాల్కర్ తో సంబంధం వ‌ల్ల‌నే విడిపోయింద‌ని అన్నారు.

Samantha Stylist Wants Naga Chaitanya to Break His Silence
Samantha Stylist Wants Naga Chaitanya to Break His Silence

గత కొద్ది రోజులుగా ప్రీత‌మ్‌పై దారుణంగా ట్రోల్ న‌డుస్తుంది. త‌నతో పాటు త‌న ఫ్రెండ్స్ కూడా క్లారిటీ ఇచ్చిన ఆయ‌న‌పై మాట‌ల దాడి ఆగ‌డం లేదు. ఇలాంటి రూమర్లను నాగచైతన్య ఖండిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు స్టయిలిస్ట్ ప్రీతమ్. సమంత-నాగచైతన్య విడాకుల వ్యవహారంలోకి తనను లాగడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. “సమంతను నేను జిజి (నార్త్ ఇండియాలోని కొన్ని రాష్ట్రాల్లో చెల్లెలు అని అర్థం) అని పిలుస్తాననే విషయం అందరికీ తెలుసు.

అలాంటి వ్యక్తితో నాకు ఎఫైర్ ను ఎలా అంటగడతారు. సమంతకు నేను ఎలా ఐ లవ్ యు అని ఉలా చెప్పగలను. ఇలాంటి వార్తలు రాసి ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు. ఆల్రెడీ బాధల్లో ఉన్న ఓ మహిళను ఇలా ఇబ్బంది పెట్టడం అస్సలు మంచిది కాదు. ఈ మొత్తం వ్యవహారంపై నాగచైతన్య స్పందించకపోవడాన్ని తప్పుబట్టాడు ప్రీతమ్.

స‌మంతతో తను ఎలా ఉంటానో నాగచైతన్యకు కూడా తెలుసని, అలాంటప్పుడు ఈ తరహా పుకార్లను ఖండించాల్సిన బాధ్యత అతడిపై ఉందంటున్నాడు ప్రీతమ్. “కొన్నేళ్లుగా నాగచైతన్యకు నేను తెలుసు. సమంతతో నేను ఎలా ఉంటానో కూడా తెలుసు. నా గురించి, సమంత గురించి అలా మాట్లాడ్డం తప్పని నాగచైతన్య ఇప్పటికే చెప్పి ఉంటాడని నేను అనుకున్నాను. కనీసం దీనికి సంబంధించి నాగచైతన్య ఓ స్టేట్ మెంట్ రిలీజ్ చేసినా పరిస్థితి ఎంతో బాగుండేది. ఇప్పటికైనా నాగచైతన్య నుంచి ఓ ప్రకటన వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అని జాతీయ మీడియాతో మాట్లాడారు.