Srija : చిరంజీవి కూతురు పోస్ట్‌పై స‌మంత స్టైలిస్ట్ ప్రీత‌మ్ స్ట‌న్నింగ్ కామెంట్

Srija : నాగ చైత‌న్య‌- స‌మంత విడాకుల త‌ర్వాత ప్రీత‌మ్ అనే వ్య‌క్తి వార్త‌ల‌లో నానిన విష‌యం తెలిసిందే. స‌మంతతో అతనికి సంబంధం ఉండటం వల్లే నాగచైతన్య ఆమెకు విడాకులు ఇచ్చాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై సమంత సన్నిహితులు స్పందిస్తూ.. ప్రీతమ్.. సమంతను అక్క అని పిలుస్తాడని.. వారిద్దరి మధ్య అలాంటి అక్రమ సంబంధం అంటగట్టకండి.. అంటూ కోరారు.

Samantha stylist preetham comments about Srija
Samantha stylist preetham comments about Srija

చూస్తుంటే స‌మంత స్టైలిస్ట్ చాలా మందితో ప‌రిచ‌యం పెంచుకున్న‌ట్టుగా క‌నిపిస్తుంది. తాజాగా మరోసారి ప్రీతమ్‌ పేరు తెరపైకి వచ్చింది. మెగా డాటర్‌ శ్రీజ కల్యాణ్‌ బర్త్‌డే రోజున ఆమె పెట్టిన పోస్ట్‌పై ప్రీతమ్‌ ఆసక్తికర కామెంట్‌ చేశాడు. దీంతో ప్రీతమ్‌ పెట్టిన కామెంట్‌ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది.

Samantha stylist preetham comments about Srija
Samantha stylist preetham comments about Srija

శ్రీజ తనకు బర్త్‌డే విషెస్ తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ తన ఫొటోతో పోస్ట్‌ షేర్‌ చేసింది. దీనికి ప్రీతమ ‘సుందర్ లడికీ(అందమైన అమ్మాయి)’ అంటూ కామెంట్‌ చేశాడు. దీంతో నెటజన్ల ఫోకస్‌ ప్రీతమ్‌ కామెంట్‌పై పడింది. చూస్తుంటే ప్రీతమ్‌ సమంతకు మాత్రమే కాదు టాలీవుడ్‌కు చెందిన పలువురికి డిజైనర్‌గా వ్యవహరిస్తున్నాడంటూ చర్చించుకుంటున్నారు.

ఆ మ‌ధ్య బ‌న్నీ స‌తీమ‌ణికి సంబంధించిన పోస్ట్‌కి కూడా ప్రీత‌మ్ రిప్లై ఇచ్చాడు. ఆ పోస్ట్ కూడా తెగ వైర‌ల్ అయింది. ప్రీత‌మ్ వ‌లన స‌మంత విడాకులు తీసుకున్న‌ట్టు వార్త‌లు రాగా, అవి తెగ చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే విడాకుల వలన మానసికంగా కుంగిపోయినట్లు సమంత పరోక్షంగా తెలిపారు. ఆ బాధ నుండి బయటపడేందుకు ఆమె క్లోజ్ ఫ్రెండ్స్ తో వరుస టూర్స్ వేయడం జరిగింది. కాగా సమంత పూర్తిగా ఈ బాధ నుండి బయటపడినట్లు తెలుస్తుంది. కెరీర్ లో బిజీ అయిన సమంత, భవిష్యత్ వైపు చూస్తూ… గతాన్ని మర్చిపోయారని అనిపిస్తుంది.