Samantha: బ్యాక్ అందాలు చూపిస్తూ ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్ ఇస్తున్న స‌మంత‌

Samantha: అందాల ముద్దుగుమ్మ స‌మంత .. చైతూ నుండి విడిపోయిన త‌ర్వాత సినిమాలు, విహార యాత్ర‌ల‌తో ఫుల్ బిజీగా ఉంటుంది. ఏ కొద్ది గ్యాప్ దొరికిన టూర్స్ వేస్తుంది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు చేస్తూ చాలా బిజీగా ఉంది. ప్రొడక్షన్ వివిధ దశలలో ఉన్న రెండు ద్విభాషా చిత్రాలపై సమంత సంతకం చేసింది.

Samantha
Samantha

స‌మంత‌ అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ కోసం రాజ్ అండ్ డీకేలతో కలిసి పని చేస్తోంది. సమంత నటించిన శాకుంతలం విడుదలకు రావాల్సి ఉంది. కహానీలో నయన్ తరహాలోనే ఇప్పుడు సమంత యశోద గా గర్భిణీ పాత్రలో నటించనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. నెల రోజుల క్రితం హైదరాబాద్ లో లాంచింగ్ షెడ్యూల్ తో షూటింగ్ ప్రారంభమైంది.

యశోద చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రను పోషిస్తున్నారు. తన పాత్ర సమంత పాత్రతో సమానంగా ఉంటుందట. ఈ చిత్రం 2022 వేసవిలో తెలుగు- తమిళం- మలయాళం- కన్నడ- హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఆదిత్య 369- సమ్మోహనం వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

విహార యాత్ర‌ల విష‌యానికి వ‌స్తే స‌మంత ఇంతకుముందు కశ్మీర్ మనాలీ గోవా లాంటి డెస్టినేషన్ లకేషన్లకు పర్యటనలకు వెళ్లిన సామ్.. ప్రస్తుతం స్విట్జర్లాండ్ లోని మంచు పర్వత శ్రేణుల్లో సెలవుల్ని ఎంజాయ్ చేస్తోంది. ఆమె తన స్నేహితురాలు శిల్పా రెడ్డితో నాణ్యమైన సమయాన్ని గడుపుతోంది.

Samantha
Samantha

విదేశాల నుంచి సమంత తన టోన్డ్ బ్యాక్ ను ప్రదర్శిస్తున్న ఫోటోగ్రాఫ్ ని పంచుకుంది. స్విట్జర్లాండ్ హిల్స్ లోని సుందరమైన ప్రదేశంలో ఈ కొత్త స్నాప్ కు ఫోజిచ్చింది. సమంతా ఈ స్నాప్ లో స్కిన్ టైట్ జీన్స్ ప్యాంట్ లో తన టోన్డ్ వంపులను చూపిస్తూ వేడెక్కిస్తోంది.సామ్ పర్ఫెక్ట్ ఫిజిక్ ని మెయింటైన్ చేస్తోంది. రెగ్యులర్ గా జిమ్ యోగా అంటూ ఆరోగ్యం పరంగా ఎంతో అలెర్ట్ గా ఉంటుంది. మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు విహారయాత్రలకు వెళుతుంటుంది. సాధ్యమైనప్పుడల్లా నచ్చిన విధంగా ఆడుకునేందుకు సామ్ వెనుకాడదు.