Samantha:మీ కూతురిని ఎవ‌రు పెళ్లి చేసుకుంటార‌నే ఆందోళ‌న వ‌ద్దు.. మంచిగా చ‌దివించండి అంటున్న సామ్

Samantha: నాగ చైత‌న్య నుండి విడాకులు తీసుకున్న‌ప్ప‌టి నుండి స‌మంత తెగ వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది. ఈ అమ్మ‌డి గురించి పలు యూట్యూబ్ ఛానెల్స్ పెద్ద ఎత్తున గాసిప్స్ ప్రసారం చేయడమే గాక, అభ్యంతరకరమైన థంబ్‌నెయిల్స్ పెట్టాయి. దీంతో సోషల్‌ మీడియాలో తన పరువుకు నష్టం కలిగించేలా దుష్ప్రచారం చేశారంటూ సమంత కోర్టుకెక్కడం సంచలనంగా మారింది.

TheNewsQube-
samantha stunning comments
samantha stunning comments

రీసెంట్‌గా ఈ కేసుపై కూకట్‌పల్లి హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సమంతకు ఊరటనిస్తూ ఆమె వ్యక్తిగత వివరాలను ప్రసారం చేయడానికి వీళ్లేదని, యూట్యూబ్‌ ఛానెల్స్‌ వెంటనే అలాంటి కంటెంట్‌ మొత్తం కూడా తొలగించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఇంజెక్షన్ ఆర్డర్‌ పాస్ చేసింది.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే స‌మంత అప్పుడ‌ప్పుడు ప‌లు ఇంట్రెస్టింగ్ పోస్ట్‌లు పెడుతూ హాట్ టాపిక్‌గా మారుతుంది.మై మమ్మా సేడ్ అనే హ్యాష్‏ట్యాగ్‏తో ప్రస్తుతం తను ఎదుర్కోంటున్న మానసిక సంఘర్షణను వెల్లడించే ప్రయత్నం చేస్తోంది. గత కొద్దిరోజులుగా సామ్ తన ఇన్‏స్టాలో పలు ఆసక్తికర పోస్ట్స్ చేస్తూ వస్తుంది.

samantha stunning comments 1
samantha stunning comments 1

ఇటీవల తన స్నేహితురాలితో కలసి ఛార్‏ధమ్ యాత్ర చేసింది సమంత. ఇందుకు సంబంధించిన ఫోటోలో నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇక తాజాగా యాత్ర ముగించిన తర్వాత.. సామ్.. పెయింటింగ్స్ వేస్తున్న ఫోటోలను షేర్ చేసుకుంది. అలాగే తన ఇన్‏స్టాలో మరో ఆసక్తికర పోస్ట్ చేసింది.

తాజాగా స‌మంత త‌న ఇన్‌స్టాలో ఒక ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టింది.‘మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారాని కంగారు పడకుండా తనని సమర్థంగా తీర్చిదిద్దండి. తన పెళ్లి కోసం డబ్బు ఆదా చేసే బదులు తన చదువుకు ఖర్చు పెట్టండి. ఆమెను పెళ్లికి సిద్ధం చేసే ముందు తన కోసం తనని సిద్ధం చేయడం అంతకంటే ముఖ్యం.

అలాగే తనని తాను ప్రేమించుకోవడం, ఆత్మవిశ్వాసంతో ఉండటం నేర్పించండి. అలాగే ఇతరులకు అవసరం ఉన్న సమయంలో తను మార్గదర్శకంగా ఉండేలా సిద్దం చేయండి’ అనే పోస్ట్‌ను షేర్‌ చేశారు. ఇప్పుడు ఇది ఇంట్రెస్టింగ్‌గామారింది.