Samantha: ఎదుటి వారిని నిందించ‌ను.. న‌న్ను నేను బ‌లంగా మార్చుకునే ప్ర‌య‌త్నం చేస్తానంటున్న స‌మంత‌

Samantha: అందాల ముద్దుగుమ్మ స‌మంత ఇటీవ‌లి కాలంలో నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూనే ఉంది. ఆమె చేసే కామెంట్స్, పెట్టే పోస్ట్‌లు నిత్యం చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. క్ష‌ణం తీరిక లేకుండా సినిమాలు మ‌రోవైపు ఫొటో షూట్స్ ఇలా ఒక‌టేంటి స‌మంత అందరి నోళ్ల‌ల్లో ఎక్కువ‌గా నానేలా ప్ర‌య‌త్నిస్తుంది.

samantha stunning comments
samantha stunning comments

చైతూ నుండి విడిపోయిన త‌ర్వాత ఆమె.. వరుస ప్రాజెక్ట్స్ ఓకే చేస్తూ దూసుకుపోతోంది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలకు సైతం కమిటవుతుంది సామ్. ఈ నేపథ్యంలో తాజాగా తన రోజువారీ అలవాట్లపై ఓ మీడియాతో మాట్లాడుతూ ఓపెన్ అయింది ఈ స్టార్ బ్యూటీ. తాను రోజంతా ఏం చేసేది, ఎలా గడుపేది, అలాగే ఎలా ఆలోచించేది.. తన ఇష్టాయిష్టాలేంటి? తదితర విషయాలపై సమంత ఓపెన్ అయింది.

తన ఏడు అలవాట్లు ఇవేనని చెబుతూ తన రోజువారి హ్యాబిట్స్ గురించి తెలిపింది. నేను రోజు ఉదయాన్నే ఐదు గంటలకు నిద్రలేస్తాను. అదే నాకు మంచి ప్రారంభాన్ని ఇస్తుంది. ప్రతీ రోజు ఉదయం డే గురించి ముందే ఆలోచిస్తాను. ఈ రోజంతా ఎలా ఉండబోతోందనేది అంచనా వేసుకుంటాను. ఏయే పనులు చేయాలో బేరీజు చేసుకొని డే ప్రారంభిస్తాను. అదే నాలో నూతనోత్సాహం నింపుతుంది.

నేను తీసుకునే ఆహారం పూర్తిగా మొక్కల ఆధారితమైనది. శాకాహారి జీవనశైలిని స్వీకరించడం వ్యక్తిగతంగా నాకు చాలా స్వేచ్ఛనిస్తుంది. నేను పూర్తి వేగన్‌గా మారిపోయాను. నాకు సానుభూతి ఎక్కువే. నా పర్సనల్, సినీ కెరీర్‌లో నాకు అదే చాలా ఉపయోగపడింది. మరింత బాధ్యతాయుతంగా ఉండటానికి కారణమైంది. ఎదుటివారిని నిందించకుండా ఉంటూ సమస్యల పరిష్కారాలను కనుగొనడం సులువు చేసుకుంటాను. నా సానుభూతిని మరింత పెంచుకోవడానికి, నేను ప్రతిరోజూ ఏదో ఒక పనిని స్పృహతో చేస్తాను. నా ఫౌండేషన్‌తో కలిసి పనిచేయడం లేదా పిల్లలతో సమయం గడపడం వల్ల నాలోని బలం రెట్టింపవుతుంది.

ఒక నది రాయిని చీల్చుతుంది. అది దాని శక్తి వల్ల కాదు, దాని పట్టుదల వల్ల అని జిమ్ వాట్కిన్స్ అన్నారు. నేను పాటించే మంత్రం అదే. నేనెప్పుడూ నిరాశ చెందను. ఏదైనా సాధ్యం అని ప్రతిరోజూ సవాలుతో కూడిన పనులు చేస్తాను. ఎల్లప్పుడూ చురుగ్గా ఉండేందుకు ఇది ఎంతగానో సాయపడుతుంది.

నేను నాతో మాత్రమే పోటీ పడుతూ నా చుట్టూ ఉన్నవారి కంటే నన్ను నేను బలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాను. నా హద్దులను నేనే చెరిపేసుకుంటాను. ఎవ్వరితోనూ పోటీ పడను. జిమ్, సెట్ ఇలా ఎక్కడైనా సరే నన్ను నేను ముందుకు నడిపించుకునేలా చూసుకుంటాను.

Samantha Ruth Prabhu is simply graceful in white blouse and skirt for  Hyderabad event: Viral photos inside | Fashion Trends - Hindustan Times

గదిలో తెలివైన వ్యక్తిగా ఉండటం నాకు ఇష్టం లేదు. కాబట్టి ప్రతిరోజూ నాకు ఏదైనా కొత్త విషయాలను నేర్పించగల వ్యక్తులతో కాస్త సమయం గడుపుతాను. ఎప్పటికప్పుడు నన్ను డెవలప్ చేసుకునేందుకు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాను అంటూ స‌మంత ఏడు సూత్రాల‌ను చెప్పుకొచ్చింది.