Samantha: చిన్నారి పాట‌కు మురిసిపోయిన స‌మంత‌.. డెడ్ అంటూ స్ట‌న్నింగ్ రియాక్ష‌న్

Samantha: అందాల ముద్దుగుమ్మ స‌మంత ప్ర‌స్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పెష‌ల్ సాంగ్స్ ఇలా త‌న‌కు వ‌చ్చిన ఏ ఆఫ‌ర్ వ‌ద‌ల‌కుండా చేస్తుంది. ఇటీవ‌ల పుష్ప సినిమాలో స‌మంత చేసిన స్పెష‌ల్ సాంగ్‌కి ఏ రేంజ్‌లో రెస్పాన్స్ వ‌చ్చిందో మ‌నం చూశాం. ఈ పాటకు థియేటర్లలో మరింత అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. హస్కీ వాయిస్‌తో సాగే ఈ పాట సోషల్‌ మీడియాలో కూడా దూసుకుపోయింది.

samantha stunning action by seeing gril video
samantha stunning action by seeing gril video

 

చాలామంది ఈ పాటను స్ఫూప్‌ చేశారు. తమదైన స్థాయిలో రీక్రియేట్‌ చేసి రీల్స్‌, షార్ట్స్‌ రూపంలో సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. తాజాగా ఓ చిన్నారి కూడా ఎంతో క్యూట్‌గా పాటను ఆలపించింది. చిట్టి పొట్టి మాటలతో పాటను హమ్‌ చేసే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సమంత, దేవిశ్రీప్రసాద్‌ లాంటి సెలబ్రిటీలు కూడా ఈ చిన్నారి పాటకు ఫిదా అవుతున్నారు.

ఓ చిన్న అమ్మాయికి వాళ్ల అమ్మ ఇంగ్లీష్ ప‌దం Whoని చూపించి హు అంటార‌ని చెబుతుంది. ఆ పాప అలా చెబుతూనే ఊ అంటావా మావ ఉ ఉ అంటావా మావ పాట పాడుతుంది. ఆ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. ఈ వీడియోను ఏకంగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ షేర్ చేశారు. పాప చాలా క్యూట్‌గా ఉంద‌ని ఆయ‌న కామెంట్ కూడా పోస్ట్ చేశారు.

ఇప్పుడు ఈ పాప సాంగ్‌కి మురిసిపోయిన స‌మంత చిన్నారి ఎక్స్‌ప్రెషన్లకు ముగ్ధురాలై ఈ వీడియోను తన సోషల్‌ మీడియా ఖాతాల్లో పంచుకుంది. ‘డెడ్‌’ అంటూ మూడు లవ్‌ ఎమోజీలతో క్యాప్షన్‌ ఇచ్చింది.కాగా ఈ పాటను ప్రముఖ ఫోక్‌ సింగర్‌ మంగ్లీ సోదరి ఇంద్రావతి పాడిన సంగతి తెలిసిందే.

samantha
samantha

ఐకాన్‌ స్టార్‌ మొదటిసారి పూర్తి మాస్‌ పాత్రలో నటించిన చిత్రం ‘పుష్ప’. ‘ఆర్య’, ‘ఆర్య2’ సినిమాల తర్వాత క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌- బన్నీ కాంబినేషన్‌లో తెరకెక్కిందీ చిత్రం. రష్మిక మందన హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం డిసెంబర్‌17న విడుదలైన కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక సమంత స్పెషల్ సాంగ్‌ ఈ సినిమాకు మరో ప్రత్యేకాకర్షణగా నిలిచింది. ‘ఉ అంటావా మావ.. ఉహూ అంటావా మావ’ పాట మాస్‌ జనాలను బాగా ఆకట్టుకుంది.