Samantha: చైతూని మ‌రచిపోయేందుకు స‌మంత ఇలాంటి ప‌నులు చేస్తుందా..!

Samantha: నాగ చైత‌న్య‌- స‌మంత అక్టోబ‌ర్ 2న త‌మ రిలేష‌న్‌కి అఫీషియ‌ల్‌గా తెరదించిన విష‌యం తెలిసిందే. వారిద్దరూ విడిపోవడానికి కారణాలను మాత్రం వెల్లడించలేదు. దీంతో సోషల్‌ మీడియాలో వీరి విడాకుల విషయం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో చై-సామ్‌ విడిపోవడానికి కారణాలు ఏముంటాయనే దానిపై విశ్లేషిస్తూ పలువురు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

Samantha Spending More Time at Gym to Come out of Depression
Samantha Spending More Time at Gym to Come out of Depression

చై-సామ్‌ విడిపోవడానికి సమంత స్టైలిష్ట్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌ వల్ల వీరిమధ్య మనస్పర్థలు వచ్చాయని, సమంత, ప్రీతమ్‌ చాలా సన్నిహితంగా ఉండటమే విడాకులకు దారి తీసిందంటూ కొందరూ కామెంట్‌ చేశారు. దీంతో ప్రీతమ్‌ను నెటిజన్లు దాడి చేయడం ప్రారంభించారు. అయితే ఎవ‌రేమి అనుకున్నా స‌మంత అవేమి ప‌ట్టించుకోకుండా త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళుతుంది.

అయితే విడాకుల డిప్రెషన్‌ నుంచి స‌మంత బ‌య‌ట‌ప‌డేందుకు స‌మంత జిమ్‌లో ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తుంద‌ట‌. ఎప్పుడు సమయం దొరికినా అన్ని విషాలను మర్చిపోయి జిమ్‌లోనే గడిపేస్తోంది సమంత అని తెలుస్తోంది. ఇక విడాకుల ముందు స‌మంత సినిమాల‌కు స్వ‌స్తి ప‌ల‌కాల‌ని భావించింది. కాని ఎప్పుడైతే విడాకులు తీసుకుందో ఇక అప్ప‌టి నుండి కొత్త క‌థ‌లు వింటుంద‌ట‌.

ఫ్యామిలీ మ్యాన్‌-2తో బిగ్గెస్ట్‌ హిట్‌ అందుకున్న సమంతకు బాగానే ఆఫ్రలు వచ్చాయి. మళ్లీ ఓ బాలీవుడ్‌ సినిమా సైన్‌ చేసింది. మరోవైపు తెలుగులోనూ కృష్ణప్రసాద్‌ నిర్మాతగా లేడీ ఓరియంటెడ్‌ ఫిల్మ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే స‌మంత త‌న ప్రాజెక్టుల‌కు సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న‌లు చేయ‌నుంది.