Samantha : బ‌ల‌ ప్ర‌ద‌ర్శ‌న చూపించే వాళ్లు ఎప్ప‌టికీ స్ట్రాంగ్ కాలేరు.. స‌మంత పోస్ట్ ఎవ‌రిని ఉద్దేశించి..!

Samantha : నాగ చైతన్యతో వివాహ బంధానికి ముగింపు పలికిన తర్వాత తన ఫ్రెండ్స్‌తో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తోంది సమంత. చెయ్ జ్ఞాపకాల నుంచి నెమ్మదిగా బయటపడేందుకు ట్రై చేస్తోంది. ఇటీవల తన స్నేహితురాలు శిల్పా రెడ్డితో కలిసి పుణ్యస్థలాలను దర్శించింది. పలు పూజా కార్యక్రమాలు నిర్వహించింది.

TheNewsQube-
Samantha social media post viral
Samantha social media post viral

మ‌రోవైపు వరస సినిమాలకు సైన్ చేసింది. మరో ఐదేళ్ల వరకు ఆమె డేట్స్ ఖాళీగా లేవు. క‌థానాయిక‌గా న‌టిస్తూనే స్పెష‌ల్ సాంగ్స్ కి సై అంటుంది. మ‌రోవైపు ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తోంది. స్నేహితులతో తాను వేస్తున్న టూర్స్ తాలూకు విశేషాలతో పాటు మై మామ్ సెడ్ అంటూ జనాన్ని ఆలోచనల్లో పడేసే కొటేషన్స్ షేర్ చేస్తోంది.

‘పిచ్చుక మీద బ్రహ్మ ఆస్త్రమా’ అనే అర్థం వచ్చేలా తాజాగా ఇన్‌స్టా స్టోరీలో సమంత చేసిన వ్యాఖ్య ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘‘మన ముందు బల ప్రదర్శన చూపించేవాళ్లు మెంటల్‌గా ఎప్పటికీ స్ట్రాంగ్‌ కాలేరు. తెలియని యుద్ధాలను అధిగమించేవారే నిజమైన బలవంతులు’’ అని సమంత పేర్కొన్నారు.

అయితే స‌మంత‌ వ్యాఖ్యలు ఎందుకు చేశారు? ఎవరిని ఉద్దేశించి చేశారన్నది తెలియాల్సి ఉంది. నెటిజన్లు మాత్రం ఎవరి ఊహాగానాలకు తగ్గట్లు వారు ఊహించుకుంటున్నారు. సమంత వేసే ప్రతి సెటైర్‌కు సోషల్‌ మీడియా నుంచి మంచి మద్దతు లభిస్తోంది.

సమంత తెలుగులో ‘ఏమాయ చేశావే’ సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసింది. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఆమె నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు.