Samantha: కొప్పు ముడేసి వైట్ డ్రెస్‌లో రెచ్చిపోయిన స‌మంత‌

Samantha: అక్కినేని కోడ‌లు స‌మంత వ‌రుస ఫొటో షూట్స్‌తో నానా ర‌చ్చ చేస్తుంది. మ‌ళ్లీ ఆ ఫోటో షూట్స్ మాములు ఫొటో షూట్స్ కాదు, అందాల జాత‌ర‌లా ఉండే ఫొటో షూట్స్. అన‌సూయ‌ని ఇంత హాట్‌గా చూసి ప్ర‌తి ఒక్క‌రు స్ట‌న్ అవుతున్నారు. ఒక‌వైపు సినిమాల‌తో సంద‌డి చేస్తూ ఉండే స‌మంత ఇలా స‌డెన్‌గా వ‌రుస ఫొటో షూట్స్‌తో ర‌చ్చ చేయ‌డంపై అంద‌రిలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

Samantha Sizzling Photos
Samantha Sizzling Photos

‘ఏమాయ చేశావే’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన స‌మంత‌.. చాలా తక్కువ సమయంలోనే మరెవరికీ సాధ్యం కాని రీతిలో పాపులారిటీని సంపాదించుకుంది. సుదీర్ఘ కాలంగా సినీ ప్రపంచంలో తన హవాను చూపిస్తూ దూసుకుపోతోంది సమంత. తెలుగులోనే కాదు.. తమిళంలోనూ ఈ బ్యూటీ ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకుంది.

Samantha Sizzling Photos
Samantha Sizzling Photos

దక్షిణాదిలోనే స్టార్ హీరోయిన్‌గా తన హవాను చూపించిన సమంత.. ఆహా సంస్థ కోసం ‘సామ్ జామ్’ షోను హోస్టు చేసి డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2′ అనే వెబ్ సిరీస్‌ను కూడా చేసింది. ఇందులో ఆమె నెగెటివ్ పాత్రలో నటించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది.


వెబ్ సిరీస్‌తో స‌మంత‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. అలాగే ఇటీవలే ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్’ అవార్డు కూడా దక్కింది.రీసెంట్‌గా ‘శాకుంతలం’ అనే పాన్ ఇండియా చిత్ర షూటింగ్ పూర్తి చేసిన స‌మంత ప్ర‌స్తుతం త‌మిళ సినిమాతో బిజీగా ఉంది. మ‌రోవైపు హాట్ ఫొటో షూట్స్‌తో ర‌చ్చ చేస్తుంది. ఎద, నడుము అందాలు కనిపించేలా ఘాటు ఫోజుల్లో హొయలు పోతూ ర‌చ్చ చేస్తుంది. తాజాగా కొప్పు ముడేసి వైట్ డ్రెస్‌లో రెచ్చిపోయిన ఈ ముద్దుగుమ్మ అంద‌రిని అల‌రిస్తుంది.