Pushpa: బాబోయ్ స‌మంత స్పెష‌ల్ సాంగ్ కోసం అంత రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుందా..!

Pushpa: ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప‌. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర‌లో అల్లు అర్జున్‌ సరసన రష్మిక కనిపించనుంది. ఫాహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని మూడు పాటలు శ్రోతల్ని విశేషంగా అలరించాయి. త్వ‌ర‌లోనే నాలుగో సాంగ్ కూడా రానుంది

samantha special song
samantha special song

సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప’లో సమంత ప్రత్యేక గీతంతో సందడి చేయనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ‘‘పుష్ప’ చిత్రంలోని ఐదో పాట ఎంతో ప్రత్యేకమైంది. ఈ స్పెషల్‌ సాంగ్‌కు స్పెషల్‌ వ్యక్తి ఉంటేనే బాగుంటుందనిపించింది. అలా సమంతను సంప్రదించాం. ఆమె వెంటనే ఓకే చేశారు’ అని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. తన కెరీర్‌లో సమంతకు ఇదే తొలి ఐటెమ్‌ సాంగ్‌ కానుండ‌డం విశేషం.

స్పెష‌ల్ సాంగ్ కొసం సమంత రెమ్యునరేషన్ రూ 1.5 కోట్లు తీసుకుందని సమాచారం. ఇదే నిజమైతే రికార్డ్ అని చెప్పుకోవాలి. ఇప్పటివరకు ఐటెం సాంగ్స్ చేసిన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్, తమన్నాలు కూడా ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్ అందుకోలేదు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్న సమంతకు పుష్ప మేకర్స్ ఒక్క సాంగ్‌కే భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

నాగచైతన్యతో విడాకులు ప్రకటించిన అనంతరం మరింత జోష్‌తో సమంత రాబోతుందనే సిగ్నల్స్ ఇస్తూనే ఉంది. గ్లామర్‌ పరంగానూ తాను తగ్గేదెలే అనే అనే సంకేతాలను ఇస్తూ వచ్చింది సమంత. ఇప్పటికే రెండు బైలింగ్వల్‌ చిత్రాలను ఓకే చెప్పింది. ఆమె నటించిన `శాకుంతలం` చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. మరోవైపు తమిళంలోనూ ఓ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. దీంతోపాటు బాలీవుడ్‌లోకి ఎంట్రీకి ప్లాన్‌ చేసుకుంటుంది.

samantha-shocking-remuneration-for-pushpa-song
samantha-shocking-remuneration-for-pushpa-song

పుష్ప విష‌యానికి వ‌స్తే.. అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న `పుష్ప` చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమవుతుంది. ఇందులో ఫాహద్‌ ఫాజిల్‌ విలన్‌గా, సునీల్‌, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన లభించింది.