Shakuntalam : బిగ్ షాక్… శాకుంతలం మళ్లీ వాయిదా పడిందా?
NQ Staff - January 31, 2023 / 10:03 PM IST

Shakuntalam : సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17వ తారీఖున ప్రేక్షకుల ముందు రాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రైలర్ ని కూడా విడుదల చేసి సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెడుతున్నట్లుగా దర్శక నిర్మాత గుణశేఖర్ ప్రకటించాడు.
ఈ సినిమాను దిల్ రాజు సమర్పిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా భారీ రిలీజ్ దక్కే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఈ సమయంలో శాకుంతలం సినిమా విడుదల వాయిదా పడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు స్పీడ్ అందుకోలేదు. భారీ బడ్జెట్ సినిమా అవడంతో పాటు పాన్ ఇండియా సినిమా అంటూ దర్శక నిర్మాత గుణశేఖర్ ప్రచారం చేస్తున్నాడు, కనుక నెల రోజుల ముందు నుండి ప్రమోషన్ హడావుడి మొదలవ్వాలి.
కానీ ఇప్పటి వరకు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్ లో మొదలైన దాఖలాలు కనిపించడం లేదు. దాంతో శాకుంతలం సినిమా విడుదలవుతుందా లేదంటే మళ్లీ వాయిదా వేసే ఉద్దేశం ఏమైనా ఉందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సమంత ప్రస్తుతం అనారోగ్య కారణాల వల్ల ప్రమోషన్ కార్యక్రమాలకు వచ్చే పరిస్థితిలో లేదట. అందుకే సినిమాను వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కొందరు కామెంట్ చేస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది గుణ టీం వర్క్ అధికారికంగా క్లారిటీ ఇస్తే కానీ తెలియదు.