Samantha : ‘బుద్ధి ఉండాలి, ప్లానింగ్ లేని వెధవలు మీరు’.. మండిపడుతోన్న సమంత వీరాభిమానులు!

Samantha : తెలుగు వెండి తెరపై ఎంట్రీ ఇచ్చింది మొదలు ఇప్పటివరకూ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమేరాని అక్కినేని సమంతకు ఇటీవల కాస్త బ్యాడ్ టైమ్ నడుస్తోందనే చెప్పాలి. మొన్న సోషల్ మీడియాలో ఎవరితోనో లిమిట్స్ దాటి దిగిన ఫొటో పెట్టినందుకు మామ నాగార్జున లైట్ గా క్లాస్ తీసుకున్నాడని, దీంతో వెంటనే ఆ పోస్టింగ్ ని డిలీట్ చేసిందని వార్తలు వచ్చాయి. అలాంటి మరో బ్యాడ్ న్యూసే ఆమె ఇప్పుడు వినాల్సి వచ్చిందట.

ముచ్చటగా..

అందం.. అభినయం.. అదృష్టం.. ముచ్చటగా మూడూ ఒకేసారి కలిసొచ్చిన సమంత.. పెద్ద తెరపై పెద్ద స్టార్ గా వెలిగిపోతున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా నేపథ్యంలో ఆమె కాస్త రూటు మార్చి బుల్లి తెర పైనా తనదైన ముద్ర వేసే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికే ‘శ్యామ్ జామ్’ అనే సెలెబ్రిటీ టాక్ షోతో టీవీ, స్మార్ట్ ఫోన్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తోంది. ఈ క్రమంలో వెబ్ సిరీస్ కి కూడా పచ్చ జెండా ఊపింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’లో కొంగొత్త పాత్రలో కనిపించనుంది.

అయితే: Samantha

సమంత విలన్(టెర్రరిస్టు)గా నటించిందంటున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఇందులో మనోజ్ బాజ్ పేయ్, ప్రియమణి ముఖ్య పాత్రలు పోషించారు. అఫిషియల్ ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటున్న ఈ థ్రిల్లర్ సిరీస్ ని ఈ నెల 12న అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం చేయాలని కూడా డేట్ ఫిక్స్ చేయటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ.. ఆ ఆనందం వారికి ఎక్కువ రోజులు నిలవలేదు.

Samantha : samantha-fans-fires-on-amazon-prime
Samantha : samantha-fans-fires-on-amazon-prime

ఏమైంది?..

‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ రిలీజ్ కి మరింత సమయం పట్టేట్లు ఉందని తాజాగా తెలుస్తోంది. దీనికి కారణమేంటో ‘అమెజాన్ ప్రైమ్’వాళ్లు చెప్పలేదు. కానీ.. వాళ్లు రీసెంటుగా విడుదల చేసిన తాండవ్, మీర్జాపూర్ వెబ్ సిరీస్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నాయి. అందుకే సమంత సిరీస్ వెనక్కి పోయిందని చెబుతున్నారు. ఈ విషయం తెలిసి ఆమె అభిమానులు అమెజాన్ ప్రైమ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పక్కా ప్లానింగే కాదు అసలు బుద్ధి కూడా లేని వెధవలంటూ ఫైర్ అవుతున్నారు.

Advertisement