Samantha: నా జీవితంలో చాలా మానసిక సమస్యలను ఎదుర్కొన్నాను: సమంత

Samantha: న‌టి స‌మంత ఇటీవ‌లి కాలంలో తెగ హాట్ టాపిక్ అవుతుంది. ప‌ర్స‌న‌ల్, ప్రొఫెష‌న‌ల్ విష‌యాలు షేర్ చేస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. తాజాగా హైద్రాబాద్ లో రోష్ని ట్రస్ట్ ఏర్పాటు చేసిన సైకియాట్రి ఎట్ యువర్ డోర్ స్టెప్ కార్యక్రమంలో పాల్గొన్నారు సమంత. ఈ సందర్బంగా మాట్లాడిన ఆమె..‘నా జీవితంలో చాలా మానసిక సమస్యలు ఎదుర్కొన్నా అలాంటి సమయంలో నా స్నేహితులు, వైద్యుల సహాయం తీసుకున్నాను అని చెప్పుకొచ్చింది.

samantha sad statment
samantha sad statment

నేను ఈ రోజు ధైర్యంగా నిలబడటానికి,జీవితంలో ముందుకి సాగటానికి నా స్నేహితులు, కుటుంబం, కౌన్సిలర్ల సహయమే కారణం. శరీరానికి దెబ్బ తగిలితే వైద్యులను కలుస్తామో….. అలాగే మనసుకి గాయం అయినప్పుడు వైద్యులను సంప్రదించాలి. ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో అంత బాగుంది అన్నట్లు పోస్ట్ లు పెడ్తారు కానీ గ్లామర్ ప్రపంచంలో ఎవరు పర్ఫెక్ట్ గా లేరు’అని అన్నారు.

నాగచైతన్యతో విడాకుల ప్రకటన అనంతరం సమంత తన కెరీర్ పై దృష్టి పెట్టింది. తిరిగి సినిమాలతో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా.. బాలీవుడ్, హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది సామ్. అయితే గత కొద్దిరోజులుగా సమంత విడాకుల తర్వాత తాను ఎదుర్కోన్న పరిస్థితులు.. మానసిక సంఘర్షణ గురించి పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది.

సోష‌ల్ మీడియాలోను ఇన్ డైరెక్ట్‌గా తాను ప‌డే ఇబ్బందుల గురించి చెప్పుకొస్తూ ఉంటుంది. విడాకుల త‌ర్వాత నుండి ఆమె పెట్టే
ప్ర‌తి పోస్ట్ హాట్ టాపిక్‌గా మారుతూ ఉంటుంది. ఇటీవ‌ల స‌మంత య‌శోద సెకండ్ షెడ్యూల్ మొద‌లు పెట్టింది. అతి త్వ‌ర‌లోనేఈ సినిమా షూటింగ్ పూర్తి చేయ‌నుంది.

samantha sad statment2
samantha sad statment2

ప్రస్తుతం సమంత వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. ఇటీవల పుష్పలో ఊ అంటావా మావ.. ఊహు అంటావా పాటతో అదరగొట్టిన సామ్.. ప్రస్తుతం యశోద సినిమా చేస్తుంది. ఇక సామ్ నటించిన శాకుంతలం సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.