Evaru Meelo Koteeswarlu: ఎన్టీఆర్ షోకు స‌మంత త‌ర్వాత మ‌రో స్టార్ హీరోయిన్..!

Evaru Meelo Koteeswarlu: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బుల్లితెర‌పై తెగ సంద‌డి చేస్తున్నాడు. ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్యక్ర‌మంతో మంచి వినోదం పంచుతున్నాడు. ఈ షోకి సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం క్యూ క‌ట్టడం ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్‌,రాజ‌మౌళి,కొర‌టాల హాజ‌రు కాగా, మ‌హేష్ బాబు కూడా ఈ షోలో సంద‌డి చేశారు.ఇక స‌మంత కూడా షోకి హాజ‌రైన‌ట్టు ప్రచారం జ‌రుగుతుంది.

Samantha Ruth Prabhu to feature in Jr NTR-hosted Evaru Meelo Koteeswarulu
Samantha Ruth Prabhu to feature in Jr NTR-hosted Evaru Meelo Koteeswarulu

ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రామ్‌లో పాల్గొంది. ఈ ప్రోగ్రామ్ దీపావళి కానుకగా ప్రసారం కానుంది. ఈ షోలో సమంత దాదాపు రూ. 25 లక్షల వరకు ప్రైజ్ మనీ గెలిచినట్టు సమాచారం. దాన్ని సమంత ఓ ఛారిటీకి అందజేసారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ప్ర‌భాస్ కూడా హాజరు కానున్న‌ట్టు ప్రచారం జ‌రుగుతుంది.

తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ షోకి మిల్కీ బ్యూటీ తమన్నా ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారట. తారక్, తమన్నాలు గతంలో ‘ఊసరవెల్లి’ అనే సినిమాలో నటించారు. వీరిద్దరి మధ్య బాండింగ్ ఉంది. దీంతో తారక్, తమన్నాలు కలిసి ఈ షోలో కనిపిస్తే.. షో ఓ రేంజ్‌లోకి వెళ్లిపోతుంది అని.. షో నిర్వాహకులు భావిస్తున్నారు.

దసరా కానుకగా.. మహేష్ బాబు ఎపిసోడ్, దీపావళి కానుకగా సమంతల ఎపిసోడ్ ప్రసారం అవుతుందని టాక్ వినిపిస్తుంది. అయితే తమన్నాతో కూడా త్వరలో షూటింగ్ జరుగుతుంది అని.. ఆ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా వస్తుంది అని తెలుస్తోంది. ప్రస్తుతానికి దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.