SAMANTHA: వెబ్ సిరీస్‌లో స‌మంత‌.. పాత్ర‌పై వ‌చ్చిన స్మాల్ క్లారిటీ..!

అక్కినేని కోడ‌లిగా ప్ర‌మోష‌న్ పొందాక స‌మంత పూర్తిగా మారిపోయింది. చేసే బిజినెస్, సినిమాల‌లో వైవిధ్యం అంద‌రికి షాక్ ని క‌లిగిస్తుంది. ‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్ సీజన్ 2 ద్వారా తొలి సారి డిజిటల్ ప్లాట్ఫామ్‌లోకి అడుగుపెట్టింది స‌మంత‌. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్ తొలి సీజన్కు గత ఏడాది డిజిటల్ ఎంటర్టైన్ మీడియమ్లో మంచి ఆదరణ లభించింది. తొలి సీజన్లో మనోజ్ బాజ్పేయి, ప్రియమణి, షరీబ్ హష్మీ, నీరజ్ మాధవ్ కీలక పాత్ర పోషించారు. రెండో సీజన్లో సమంత ఓ లీడ్ చేశారు. మార్చిలో విడుద‌ల కానున్న వెబ్ సిరీస్ వాయిదా ప‌డింది.

Samantha Akkineni Green Dress Looks
 

మరి కొద్ది రోజుల‌లో విడుదల కానున్న ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్‌లో స‌మంత నెగెటివ్ పాత్ర పోషిస్తుంద‌ని, ఆమె టెర్ర‌రిస్ట్‌గా క‌నిపించ‌నుంద‌ని జోరుగా ప్ర‌చారం న‌డిచింది. ఈ విషయమై రాజ్ అండ్ డీకే క్లారిటీ ఇచ్చారు. ‘ది ఫ్యామిలీమేన్’ వెబ్ సిరీస్లో సమంతను తీసుకోవడానికి కారణం ఉంది. ఆమె క్యారెక్టర్లో కొన్ని షేడ్స్ ఉంటాయి. స్ట్రాంగ్ క్యారెక్టర్… సమంతది విలన్ పాత్ర అని చెప్పలేం కానీ మనోజ్ బాజ్‌పేయికి మాత్రం ప‌క్కా అపోజిట్ క్యారెక్టర్. జూన్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ప్లాన్ చేస్తున్నాం. అలాగే వెబ్ సిరీస్ ట్రైలర్‌ని అతి త్వరలో విడుదల చేయనున్నాం. ఆ ట్రైలర్లో సమంత పాత్ర గురించి మరింత తెలుస్తుంది అన్నారు. ఈ వెబ్ సిరీస్ కోసం హిందీలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుందిట సామ్.