Samantha: అక్కినేని పేరు తొల‌గించ‌డం పై స్పందించిన స‌మంత‌

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా ఉన్న స‌మంత సోష‌ల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంద‌న్న సంగ‌తి మ‌నంద‌రకి తెలిసిందే. ఈ అమ్మడు ఇటీవ‌ల తన సోషల్ మీడియా ప్రొఫైల్ పేరు సమంత అక్కినేని నుండి సింపుల్ S గా మార్చింది. దీంతో అభిమానుల‌లో అనేక సందేహాలు తలెత్తాయి. ఎవ‌రికి న‌చ్చిన‌ట్టు వారు క‌ట్టు క‌థ‌లు అల్లేశారు.

ఈ క్ర‌మంలో తాజాగా స్పందించిన స‌మంత‌.. ఇలాంటి వాటి గురించి మాట్లాడే మూడ్ లో లేనని పేర్కొన్నది. నేను ఏదైనా వివాదం లేదా ట్రోల్ పై మాట్లాడాలనుకున్నప్పుడు మాత్రమే స్పందిస్తాను“ అని అన్నారు. కానీ ఇలా ఎన్నాళ్లని దాచగలరు? అని ప్ర‌శ్నించ‌గా, దీనికి స్పందించిన స‌మంత‌.. నేను ఆ విషయాలలో దేనికీ స్పందించాలనుకోవడం లేదు. నాకు వివాదాలు నచ్చవు.

ఎవరికైనా వారి స్వంత అభిప్రాయాలకు ఎలా అర్హత ఉంటుందో నేను కూడా నా హక్కుకు అర్హత కలిగి ఉన్నాను“ అని సామ్ చెప్పింది. అక్కినేని కుటుంబంలో భాగం కావడం వల్ల ఎలాంటి కఠినమైన ఎంపికలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.అలానే నాకు అసాధారణ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నంత మాత్రాన అభిమానుల కోసమే నేను సినిమాలు చేస్తానని కూడా ఎప్పుడూ చెప్పలేదు. నచ్చినవి చేసుకుంటూ వెళుతున్నాను అని సామ్ తెలిపారు.

పదకొండేళ్లుగా నటిగా బిజీగా ఉండడం నాపై ప్రభావం చూపుతున్నందున ఇప్పుడు నటన నుండి విరామం తీసుకుంటానని తెలిపారు. చైత‌న్య సినిమాల గురించి చైత‌న్య గురించే నేను ఆందోళన చెందుతాను. చైతూ న‌టించిన ల‌వ్ స్టోరీ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను అని పేర్కొంది. అలానే `ఫ్యామిలీ మ్యాన్ 2`లో రాజీ పాత్ర వివాదాస్పదం కావ‌డంతో దానిపై కూడా స్పందించింది.

ఆ పాత్ర ప్రజల మనోభావాలను కించపరిస్తే అందుకు క్షమాపణలు. నిజానికి ఇది ఉద్ధేశ పూర్వకంగా చేసిన పాత్ర కానే కాదని వివరణ ఇచ్చారు. శాకుంతలంలో కనిపించనున్న స‌మంత నయనతార- విఘ్నేష్- సేతుపతి ల తమిళ చిత్రంలోను క‌థానాయిక‌గా న‌టిస్తుంది.