Samantha: ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ కోసం స‌మంత రెమ్యూనరేషన్ అన్ని కోట్లా..?

Samantha: కరోనా కారణంగా ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీ చాలా వరకు నష్టపోయింది. ఇదే సమయంలో డిజిటల్ మీడియా ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. సినీ ఇండస్ట్రీలో యాక్ట్ చేసిన టాప్ నటీనటులు సైతం డిజిటల్ మీడియావైపు అడుగులు వేస్తున్నారు. గత ఏడాది ప్రముఖ ఓటీటీలో రిలీజై గ్రాండ్ సక్సెస్ ను అందుకున్న ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేసింది. ఈ సిరీస్ కి సీక్వెల్ ప్లాన్ చేసింది వెబ్ సిరీస్ టీమ్.

Samantha Remuneration for Family Man 2 Web Series
Samantha Remuneration for Family Man 2 Web Series

అయితే ఈ సెకండ్ సిరీస్ లో మరింత క్రేజ్ ని, అటెన్షన్ ను పెంచే దిశగా అడుగులు వేసింది. అందుకే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఉన్న సమంతా అక్కినేని, ఫ్యామిలీ మెన్ 2 లో కీలక పాత్ర పోషించింది.

ఈ నేపథ్యంలో మొదటి నుండి సామ్ క్యారెక్టర్ పై సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేశారు. అయితే వెబ్ సిరీస్ లో నటించే వారికి సినిమాలకు ఏమాత్రం తీసిపోనివిధంగా భారీ పారితోషికం అందజేస్తున్నారనే వార్తలు ఇటీవల కాలంలో వైరల్ అవుతున్నాయి. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ లో సమంత, మనోజ్ బాజ్ పాయ్ లకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందించారట.

మనోజ్ బాజ్ పాయ్ కు మొత్తం ఎపిసోడ్లకు కలిపి 10 కోట్ల రూపాయల వరకు తీసుకున్నట్లు తెలుస్తుంది. రాజీ పాత్ర కోసం సామ్ కి 4 కోట్ల రూపాయల వరకు అందుకున్నట్లు తెలుస్తుంది. ఫ్యామిలీ మాన్ 2 రెమ్యూనరేషన్ లిస్టులో రెండో అత్యధిక పారితోషికం అందుకుంది సమంత.

మనోజ్ కు భార్య పాత్రలో నటించిన ప్రియమణికి 80 లక్షల వరకు పారితోషికం అందినట్లు సమాచారం. ఇక షరీఫ్ హష్మీకు 65 లక్షలు, దర్శన్ కుమార్ కు కోటీ రూపాయలు అందుకున్నట్లు ప్రస్తుతం డిజిటల్ మీడియా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ఏది ఏమైనా డిజిటల్ మీడియాలో కూడా స్టార్ నటీనటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ పై పాజిటివ్ టాక్ నడుస్తుంది.