Samantha: యానివ‌ర్సరీ రోజు సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టిన స‌మంత‌.. ఏం చెప్పిందో తెలుసా?

Samantha: 2010లో విడుదలైన ‘ఏమాయ చేశావే’ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించిన నాగ చైత‌న్య‌- స‌మంత .. 2017 అక్టోబర్ 6,7వ తేదీల‌లో గోవా వేదిక‌గా హిందు, క్రైస్తవ మత సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. వీరివివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. మ‌రో నాలుగు రోజుల్లో నాగచైతన్య-సమంతల నాలుగో వివాహ వార్షికోత్సవం రానుంది అనుకునే లోపు వీరు విడాకుల ప్ర‌క‌ట‌న చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

Samantha Posted Her New Post on Her Marriage Anniversary
Samantha Posted Her New Post on Her Marriage Anniversary

గతేడాది ఇదే సమయంలో నాగ చైత‌న్య‌తో దిగిన ఫొటోని షేర్ చేస్తూ..నేను నీ దాన్ని.. నీవు నా వాడివి.. ఎలాంటి పరిస్థితులైనా రానీ.. మనిద్దరం కలసికట్టుగా వాటిని ఎదుర్కొందాం.. ఆహ్వానిద్దాం.. హ్యాపీ యానివర్సరీ హస్బెండ్‌’’ అని క్యాప్షన్‌తో పోస్ట్‌ చేశారు. మీ ఇద్దరి మధ్య హద్దుల్లేని ప్రేమ, అభిమానాలు.. ఇప్పుడు అంతంలేని దూరం.. ఎందుకిలా జరిగింది.. ఏడాదిలోపే ఇంత కఠిన నిర్ణయం ఎలా తీసుకున్నారు అని నెటిజ‌నులు బాధ‌ప‌డ్డారు.

ఈ రోజు నాగ చైత‌న్య‌- స‌మంత యానివ‌ర్స‌రీ కాగా, వీరు ఏదైన పోస్ట్ చేస్తారా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూసిన క్ర‌మంలో స‌మంత ఓ పోస్ట్ పెట్టి అందరిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. తన సింగిల్ ఫోటో షేర్ చేసింది. పాత ప్రేమ పాటలు – పర్వతాలు.. శిఖరంపై శీతాకాలపు గాలి ధ్వని, కోల్పోయిన మరియు దొరికిన చిత్రాల పాటలు. లోయలో మెలంచోలిక్ ప్రతిధ్వని ధ్వని మరియు పాత ప్రేమికుల పాటలు. పాత బంగ్లాలు, మెట్ల మార్గాలు మరియు సందులలో గాలి శబ్దం అంటూ భావోద్వేగ పోస్ట్ చేసింది. అందులో సామ్.. తెల్లని డ్రెస్ ధరించి.. నేలవైపు చూస్తూ ఒంటరిగా నడుస్తూ కనిపిస్తుంది.

చై-సామ్‌ ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందనే దానిపై చాలా ఊహాగానాలు వెలువడుతున్నాయి. వాస్తవం వారిద్దరికి మాత్రమే తెలుసు. ఇప్పుడు వీరిద్దరు తీసుకున్న నిర్ణయం.. వారి జీవితాలను ఎలా మలుపుతిప్పుతుందో కాలమే నిర్ణయిస్తుంది