Samantha: ముంబైలో కొత్త ఇల్లు కొనాల‌నే ఆలోచ‌న‌లో స‌మంత‌.. అక్క‌డికి షిఫ్ట్ అవుతుందా?

Samantha: ప్ర‌స్తుతం టాలీవుడ్ సెల‌బ్రిటీస్ ఎక్కువ‌గా హిందీ ప‌రిశ్ర‌మ‌పై దృష్టి సారిస్తున్నారు.ఎక్కువ‌గా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ అక్క‌డి ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రయ్యే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో స‌మంత ప్ర‌స్తుతం శాకుంత‌లం అనే భారీ బ‌డ్జెట్ చిత్రం చేస్తుంది. ఈ చిత్రాన్ని గుణశేఖ‌ర్ భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం మొద‌లైన ఈ చిత్ర షూటింగ్ క‌రోనా వ‌ల‌న ఆగింది. ఇప్పుడు తిరిగి ప్రారంభ‌మైన‌ట్టు తెలుస్తుంది. శాకుంత‌లం సినిమాతో స‌మంత క్రేజ్ మ‌రింత పెర‌గడం ఖాయంగా క‌నిపిస్తుంది.

Samantha:

ఇక స‌మంత ఇటీవ‌ల ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో హిందీ ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైంది. ఆమె న‌ట‌న‌కు బాలీవుడ్ ఆడియ‌న్స్ తెగ ఫిదా అయ్యారు. ఈ వెబ్ సిరీస్ త‌ర్వాత స‌మంత‌కు హిందీ ప‌రిశ్ర‌మ నుండి ఎక్కువ ఆఫర్స్ వ‌స్తున్న‌ట్టు తెలుస్తుంది . ఈ క్ర‌మంలో ముంబైలో ఫ్లాట్ కొనుగోలు చేయాలని సామ్ టీమ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రీసెంట్‌గా రామ్ చ‌ర‌ణ్‌- ఉపాస‌న జోడి కూడా ముంబైలో ఫ్లాట్ కొనుగోలు చేశార‌ని, ఇప్ప‌టికే గృహ ప్ర‌వేశం కూడా పూర్తైంద‌ని స‌మాచారం. మ‌రి స‌మంత ఎప్పుడు ముంబైలోని కొత్త ఇంటికి అడుగుపెడుతుందో చూడాలి. బిజినెస్ వ్యవహారాలను హ్యాండిల్ చేస్తూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగం పంచుకుంటూ పలువురి మన్ననలు పొందుతున్నారు సమంత.

సమంత ప్ర‌స్తుతం ఓ తమిళ సినిమాలోను నటిస్తున్నారు. కవాతుల రెండు కాదల్ అనే సినిమాలో నయనతార, విజయ్ సేతుపతి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. విఘ్నేష్ శివన్ దర్శకుడు. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల కానుంది. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న శాకుంత‌లం సినిమాను అద్భుతమైన సెట్స్ వేసి తెరకెక్కిస్తున్నారు. సహజత్వం ఉట్టిపడేలా శకుంతల, దుష్యంతుల ప్రేమ కావ్యాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించబోతోన్నారు.