SAMANTHA: స్టన్నింగ్ లుక్‌లో స‌మంత‌.. ఎద అందాల‌ను చూస్తూ ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఫ్యాన్స్

అక్కినేని కోడ‌లు స‌మంత ఇటీవ‌లి కాలంలో తెగ గ్లామ‌ర్ షో చేస్తుంది. ముఖ్యంగా సాకీ అనే షోరూం ప్రారంభించిన‌ప్ప‌టి నుండి వెరైటీ డ్రెస్సుల‌లో ఈ అమ్మ‌డు ఫొటో షూట్స్ చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంది. కొన్ని ఫొటోల‌లో స‌మంత సెక్సీ లుక్‌లో కనిపిస్తుండ‌గా, ఆమెను అలా చూసి అభిమానులు మైమ‌ర‌చిపోతున్నారు. తాజాగా స‌మంత గ్రీన్ డ్రెస్‌లో హాలీవుడ్ భామ మాదిరిగా ఫొటో షూట్ చేసింది. స్ట‌న్నింగ్ లుక్‌లో స‌మంత‌ను ఇలా చూసి ఒక్క‌సారి షాక్ అయ్యారు. ప్ర‌స్తుతం స‌మంత ఫొటో సోష‌ల్ మీడియాను తెగ షేక్ చేస్తుంది.

స‌మంత చేతిలో ప్ర‌స్తుతం గుణ‌శేఖ‌ర్ శాకుంత‌లం అనే ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఉంది. సమంత అక్కినేని కావ్య నాయకి శకుంతలగా నటిస్తున్న ఈ చిత్రం గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతుండ‌గా, ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో గుణ టీం వర్క్స్ పతాకంపై నీలిమ గుణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ సాగుతున్న ఈ సినిమా తాత్కాలికంగా బ్రేక్ పడినట్టు ఓ న్యూస్ వైర‌ల్ అయింది. కాని ప్ర‌స్తుతం ఈ చిత్రం నాన్‌స్టాప్ షెడ్యూల్ జ‌రుపుకుంటుంద‌ని అంటున్నారు. చిత్రంలో దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు.

Advertisement