Sam-Chaitanya: నాగ చైత‌న్య‌- స‌మంత బంధానికి బీట‌లు వారాయా..!

Sam-Chaitanya: టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్‌లో బెస్ట్ క‌పుల్‌గా నాగ చైత‌న్య- స‌మంత జంట గురించి చెప్పొచ్చు. చూడ‌ముచ్చ‌ట‌గా ఉండే ఈ జంట ఎప్పుడు క‌లిసి క‌నిపించిన ప్రేక్ష‌కుల‌కి క‌నుల విందుగా ఉంటుంది. ‘ఏ మాయ చేశావే సినిమా’తో వెండితెరపై మెరిసి కుర్రకారును మాయ చేసిన స‌మంత అదే స‌మ‌యంలో చైతూతో ప్రేమ‌లో ప‌డింది. ఆ త‌ర్వాత వారి ప్రేమ మ‌రింత బ‌ల‌ప‌డి పెళ్లి వ‌ర‌కు వెళ్లింది.

Sam-Chaitanya

2017లో హీరో నాగచైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని వారి ఇంట అడుగు పెట్టిన సామ్‌ వివాహాం అనంతరం అదే జోష్‌ను కొనసాగించింది. అదే జోరుతో సినిమాలు చేస్తూ వరుస హిట్స్‌ అందుకుంటున్న సామ్‌ ఇటీవల డిజిటల్‌ ప్లాట్‌ఫాం ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన సత్తా చాటుకుంది. అక్కినేని కోడ‌లిగా వారి కీర్తి ప్ర‌తిష్ట‌లు ఏమాత్రం తగ్గ‌కుండా వ్య‌వ‌హరిస్తుంది.

ఇటీవ‌ల స‌మంత త‌న సోష‌ల్ మీడియా అకౌంట్స్‌లో అక్కినేని అన్న పదం తీసేసి, కేవలం ‘ఎస్’ అన్న పదం ఉంచింది. దీంతో అంద‌రిలో అనేక అనుమానాలు వస్తున్నాయి. అయితే త‌న పేరులో చేసిన మార్పు గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. తన చుట్టూ ఏర్పడ్డ వివాదాల గురించి తనకు నచ్చినప్పుడే మాట్లాడతానని చెప్పిన సమంత.. ఇలాంటి విషయాలపై తాను ఇప్పుడు స్పందించాలనుకోవడం లేదని తేల్చి చెప్పింది.

ఎవరికైనా వారి స్వంత అభిప్రాయాలకు ఎలా అర్హత ఉంటుందో, తనకు కూడా తన హక్కుకు అర్హత కలిగి ఉంటుంది. ‘అక్కినేని కుటుంబంలో భాగం కావ‌డం వల్ల క‌ఠినంగా ఉండాల్సిన అవ‌స‌రం లేదు కదా అని సమంత స్ప‌ష్టం చేసింది. స‌మంత మాట‌లు బ‌ట్టి చూస్తుంటే ఏదో జ‌రిగింద‌నే అనుమానాలు అంద‌రిలో త‌లెత్తుతున్నాయి.

టాలీవుడ్ లో హైఫై లేడీస్ కిట్టీ పార్టీల్లో కూడా సమంత-చైతూల వ్యవహారం డిస్కషన్ పాయింట్ గా వుందని టాక్. నాగ్-అమల స్వయంగా రంగంలోకి దిగి చైతూ-సమంత లకు క్లాస్ పీకారని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. ఒకటి రెండు రోజుల క్రితం ఓ దర్శకుడు చైతన్యకు ఏదో విషయమై ఫోన్ చేస్తే, తన టెన్షన్ లు తనకు వున్నాయని, తరువాత చెప్తా అని బదులు ఇచ్చారని మరో గ్యాసిప్ వినిపిస్తోంది. ఇలాంటి వార్తలు చైతూ-సామ్ మ‌ధ్య ఏదో అయింద‌నే దానికి బలం చేకూరుస్తుంది.