Samantha : అల్లు అర్హ గురించి సమంత వ్యాఖ్యలు వైరల్
NQ Staff - March 26, 2023 / 06:35 PM IST

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా సమంత మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తుంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ అల్లు అర్హ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అల్లు అర్హ తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడగలుగుతుంది. ఆ విషయంలో ఆమె తల్లిదండ్రులను అభినందించాల్సిందే.
చిన్న పాప అయినా కూడా ఎంత పెద్ద డైలాగుని అయినా సులభంగా చెప్పేస్తుంది. అర్హ తో కలిసి నటించిన సమయంలో నాకు ముచ్చట వేసేది. మొదటి రోజు షూటింగ్ లో సుమారు 100 మంది చైల్డ్ ఆర్టిస్టులు పాల్గొన్నారు.
అంత మందిలో కూడా అర్హ భయం లేకుండా ధైర్యంగా డైలాగ్స్ చెప్పింది. అర్హకు నటనలో శిక్ష అవసరం లేదు, తను పుట్టుకతోనే సూపర్ స్టార్ అంటూ సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శాకుంతలం సినిమాలో అల్లు అర్హ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే.