The family man 2 : ది ఫ్యామిలీ మ్యాన్-2 లో సమంత లుక్ రిలీజ్ ..!

The family man 2 : ది ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు వారైన దర్శక ద్వయం రాజ్ నిడిమోరు – కృష్ణ డీకే తెరకెక్కిస్తున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్-1 ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ క్రేజ్ తోనే ది ఫ్యామిలీ మ్యాన్-2 తెరకెక్కిస్తున్నారు రాజ్ నిడిమోరు – కృష్ణ డీకే. ఇన్నాళ్ళు ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమంత లుక్ ని రిలీజ్ చేయలేదు. కేవలం బ్యాక్ ఫోస్ లో ఉన్న సమంత లుక్ ని మాత్రమే రిలీజ్ చేశారు. ఈ రోజు సమంత బర్త్ డే సందర్భంగా రాజ్ నిడిమోరు – కృష్ణ డీకే తో కలిసి ఉన్న సమంత లుక్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

samantha look release in the-family-man-2
samantha look release in the-family-man-2

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ని త్వరలోనే విడుదల చేయబోతున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న ఈ ఒరిజినల్ సిరీస్ కోసం సమంత అభిమానులు మాత్రమే కాదు అక్కినేని ఫ్యామిలీ.. ఇండస్ట్రీ వర్గాలు అలాగే ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మొదటిసారి సమంత ది ఫ్యామిలీ మ్యాన్-2 లో నెగిటివ్ రోల్ పోషిస్తోంది. అంతేకాదు మొదటిసారి తన పాత్రకి తానే డబ్బింగ్ కూడా చెప్పుకుంది. వాస్తవంగా ఈ వెబ్ సిరీస్ గత ఏడాదిలోనే రిలీజ్ కావాల్సి ఉంది.

The family man 2 : ది ఫ్యామిలీ మ్యాన్-2 లో ‘రాజీ’ పాత్రలో సమంత..?

కానీ వీఎఫెక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇక ది ఫ్యామిలీ మ్యాన్-2 సిరీస్ లో ‘రాజీ’ అనే పాత్రలో సమంత నటిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ తో సామ్ పాన్ ఇండియా స్టార్ గా మారుతుందని భావిస్తున్నారు. ఫస్ట్ సీజన్ లో నటించిన బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్, సీనియర్ హీరోయిన్ ప్రియమణి, శ్రేయా ధన్వంతరి, శరద్ కేల్కర్, షరీబ్ హష్మీ ది ఫ్యామిలీ మ్యాన్-2 లోనూ కనిపించబోతున్నారు. ఇక స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం టైటిల్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తోంది.

Advertisement