Samantha: అమ్మ చెప్పిన మాట ఏంటో వివ‌రించిన స‌మంత‌..!

Samantha టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌లి కాలంలో తెగ వార్త‌ల‌లో నిలుస్తుంది. నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత.. సమంత ఒంటరిగానే బాధ నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తుంది.. విడాకుల ప్రకటన అనంతరం.. సోషల్ మీడియాలో సామ్ పై చెడు ప్రచారం జరిగింది. అయిన‌ప్ప‌టికీ తాను వాటన్నింటిని ఎదుర్కొంటూ ముందుకు సాగుతుంది.

విడాకుల ప్రకటన తర్వాత కూడా ఎక్కువగా సమంత చేస్తున్న సోషల్ మీడియా పోస్టులు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
ఏం మాయ చేశావే సినిమాతో అక్కినేని నాగచైతన్య సమంత ఇద్దరూ ఒకరికి ఒకరు పరిచయం అయ్యారు. వీరి ప్రేమ మొదలు వివాహం దాకా ప్రతి విషయం కూడా చర్చనీయాంశమైంది.

అనూహ్యంగా అక్కినేని సమంత అని ఉండే సోషల్ మీడియా అకౌంట్ లో అక్కినేని పేరు తొలగించి సమంత ఎస్ అనే పేరు పెట్టుకోవడంతో నాగచైతన్య సమంత విడాకులు తీసుకుంటున్నారు అని ప్రచారం జరిగింది. ఆ విడాకులు ప్రచారం జరిగినట్లుగానే అక్టోబర్ 2వ తేదీన తాము ఇద్దరం విడి పోతున్నామని సమంత నాగచైతన్య ఒకే సమయంలో అధికారికంగా ప్రకటించారు. వీరు నుంచి విడాకుల ప్రకటన వచ్చిన తర్వాత వీరు విడాకులకు కారణం సమంతే అని చాలామంది ప్రచారం చేస్తూ వచ్చారు

తాజాగా స‌మంత‌.. మై మమ్మా సెడ్ అనే హ్యాష్ ట్యాగ్‍తో ఓ సందేశం ఇచ్చింది సామ్. ”మీరిప్పుడు ఇలా ఉన్నందుకు కృతజ్ఞతతో ఉండండి. రేపు మీరు ఏం కావాలనుకుంటున్నారో దాని కోసం పోరాడుతూ ఉండండి” అని పేర్కొంటూ దానిపై మా అమ్మ చెప్పింది అనే ట్యాగ్ ఇచ్చేసింది సామ్. దీంతో ఈ సందేశం నెట్టింట వైరల్‌గా మారింది.

స‌మంత‌ తన స్నేహితురాళ్ళతో కలిసి చార్ధామ్ యాత్రకు వెళ్లి ఆధ్యాత్మిక భావన పెంపొందించుకునే ప్రయత్నం చేస్తోంది. విడాకుల తర్వాత సామ్‌ రెండు కొత్త చిత్రాలను అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే వీటికి సంబంధించిన షూటింగ్స్‌లోనూ పాల్గొననుంది. ఈ లోపు ఉన్న ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా వరుసగా ట్రిప్స్ కు వెళుతోంది.