Samantha: స్టైలిష్ డ్రెస్‌తో స‌మంత.. గ్లామ‌ర్ అంతా ఆర‌బోస్తుందిగా..!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత‌.. నాగ చైత‌న్య నుండి విడిపోయిన త‌ర్వాత సోష‌ల్ మీడియాలో చాలాయాక్టివ్‌గా ఉంటూ ర‌చ్చ చేస్తుంది. ప‌లు ఇంట్రెస్టింగ్ పోస్ట్‌లు పెడుతూ అంద‌రి దృష్టిని త‌న‌వైపుకు తిప్పుకుంటుంది. ఇక వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలను మర్చిపోవడం కోసం వరుస ప్రాజెక్ట్‌లు ఓకే చేస్తూ.. ఒకదాని తర్వాత మరొకటి పట్టాలెక్కించేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సామ్‌ త్వరలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

TheNewsQube-
samantha lastest photo shoot2
samantha lastest photo shoot2

స్నేహితులతో క‌లిసి ఆధ్యాత్మిక ప్ర‌దేశాల‌కు టూర్‌కి వెళ్లింది స‌మంత‌. ప‌లు చిత్రాల్లో న‌టించ‌డానికి ఓకే చెప్పింది. ఈ క్ర‌మంలో స‌మంత త్వ‌ర‌లోనే బాలీవుడ్‌లోకి ప్ర‌వేశించ‌నుంద‌ని, హీరోయిన్ తాప్సీ ఈ సినిమాను నిర్మించ‌బోతుంద‌ని త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుందంటూ కూడా వార్త‌లు వ‌చ్చాయి.

దీనిపై తాజాగా స్పందించిన స‌మంత‌.. ’బాలీవుడ్‌లో సినిమాలు చేయాల‌నే ఆస‌క్తి నాకు ఉంది. మంచి స్క్రిప్ట్ వ‌స్తే త‌ప్ప‌కుండా చేస్తాను. ఇత‌ర భాష‌ల్లో సినిమా చేయాలంటే భాష ఒక‌టే స‌మాధానం కాదు. మంచి క‌థ‌, క‌థ‌నం అవ‌స‌రం. అలాగే ఆ పాత్ర‌లో నేను న‌టించ‌గ‌ల‌నా? పాత్ర‌కు న్యాయం చేయ‌గ‌ల‌నా? అని న‌న్ను నేనే ప్ర‌శ్నించుకుంటాను’ అని తెలియజేసింది సమంత.

samantha lastest photo shoot1
samantha lastest photo shoot1

స‌మంత రెండు ద్విభాషా చిత్రాలకు ఒకే చెప్పింది. అందులో ఓ చిత్రాన్ని డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్‌, మ‌రో చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ సంస్థ‌ల్లో చేస్తుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ రెండు చిత్రాల‌ను డెబ్యూ డైరెక్ట‌ర్స్ తెర‌కెక్కించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ రెండు సినిమాలు సెట్స్ పైకి వెళ్ల‌బోతున్నాయి.

samantha lastest photo shoot
samantha lastest photo shoot

ఆ లోపు స‌మంత తొలిసారి ఓ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించ‌బోతుంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న‌ల్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప ది రైజ్’ సినిమాలో ఐటెమ్ సాంగ్ చేస్తుంది. ఈ సాంగ్ కోసం ఏకంగా స‌మంత‌కు కోటిన్న‌ర రూపాయ‌లు రెమ్యున‌రేష‌న్‌గా ఇస్తున్నార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి.

ఇక సోష‌ల్ మీడియాలోను ఈ ముద్దుగుమ్మ తెగ ర‌చ్చ చేస్తుంది. క్యూట్ క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ కేక పెట్టిస్తుంది. తాజాగా ట్రెండీ స్టైల్‌లో మెరిసిన స‌మంత అంద‌రి మ‌న‌సులు దోచుకుంది. ప్ర‌స్తుతం స‌మంత పిక్స్ వైర‌ల్ గా మారాయి.