Samantha: పింక్ క‌ల‌ర్ డ్రెస్‌లో స‌మంత‌.. ఇలా చూసి ఎవ‌రైన ఫిదా కాకుండా ఉంటారా..!

Samantha: ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మాయ చేసిన అందాల ముద్దుగుమ్మ సమంత‌. ఇందులో స‌మంత అభినయానికి ఫిదా కాని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదేమో! ఈ సినిమా త‌ర్వాత వ‌ర‌సుగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి సాలిడ్ సక్సెస్‌లను అందుకుంది సమంత. తెలుగు, త‌మిళంలో వ‌రుస విజ‌యాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా మారింది.

Samantha Latest Mind Blowing Pics
Samantha Latest Mind Blowing Pics

నాగ చైత‌న్య‌ని వివాహం చేసుకొని అక్కినేని కోడ‌లిగా మారింది. పెళ్లైన స‌మంత జోరు త‌గ్గ‌లేదు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షోస్‌తో ఫుల్ బిజీగా మారింది స‌మంత‌. ఇటీవ‌ల ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్‌లో నటించింది సమంత. ఈ వెబ్ సిరీస్ మొదట్లో కాస్త వివాదంగా మారినప్పటికీ.. మంచి సక్సెస్ అందుకుంది. ఈ సిరీస్‌లో సమంత నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. రాజీ పాత్రలో సమంత అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Samantha Latest Mind Blowing Pics
Samantha Latest Mind Blowing Pics

ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న స‌మంత .. ‘నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లుపైనే అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమాత్రం ఖాళీ లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాను. ఇప్పుటికైనా కాస్తా విరామం తీసుకోవాలనుకుంటున్నాను. ఈ సమయాన్ని పూర్తిగా వ్యక్తిగత జీవితానికి, ఫ్యామిలీకి ఇవ్వాలనుకుంటున్నా అని పేర్కొంది.

అయితే స‌మంత ఎంత బిజీగా ఉన్నా కూడా సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తూనే ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అంద‌మైన ఫొటోలు షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌కి వినోదాన్ని పంచుతుంటుంది.తాజాగా పింక్ క‌లర్ డ్రెస్‌లో స‌మంత క్యూట్ లుక్‌లో క‌నిపిస్తుంది. స‌మంత‌ని ఇలా చూసి ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు.