Samantha: విడాకుల వివాదం.. కోర్టులో అస‌లు విష‌యం తేల్చుకుంటాన‌న్న స‌మంత‌

Samantha: గ‌త కొద్దిరోజులుగా స‌మంత‌-నాగ చైత‌న్య వ్య‌వ‌హారం ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సమంత తన పేరులో అక్కినేని తొలగించిన‌ప్ప‌టి నుండి వివాదం మొద‌లైంది. సామ్‌.. నాగచైతన్యను దూరం పెట్టిందని బాగా పుకార్లు వినిపించాయి. ఇక ఇటీవలే సమంత తీర్థయాత్రలకు ఒంటరిగా ప్రయాణం కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇక తనతోపాటు నాగచైతన్య లేకపోయేసరికి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా విడాకులు తీసుకుంటున్నారని అనుకున్నారు.

స‌మంత‌-చై విడాకుల విషయంపై ఎవ‌రు పూర్తి క్లారిటీ ఇవ్వ‌డం లేదు.ఇటీవ‌ల చైతూ న‌టించిన ల‌వ్ స్టోరీ చిత్రం సూపర్ సక్సెస్ అవ్వడంతో సక్సెస్ మీట్ పెట్టగా అక్కినేని నాగార్జున ఇంటా డిన్నర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ పార్టీకి సమంత రాకపోవడంతో విడాకుల వార్తలకు మరింత బలవంతంగా చేకూరించింది. మ‌రోవైపు స‌మంత ఇన్‌డైరెక్ట్‌గా చేస్తున్న పోస్ట్‌లు కూడా అనుమానాల‌ని క‌లిగిస్తున్నాయి.

మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొద్దిరోజుల నుంచి వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో రోజురోజుకు వీరి గురించి వస్తున్న వార్తల వల్ల తనకు తన భర్త నాగచైతన్యకు పరువు నష్టం కలుగుతుందని,ఇప్పటికీ ఈ విషయంపై సైలెంట్ గా ఉంటే మరిన్ని దిగజారిన వార్తలు రాస్తారని ఈ వార్తలకు అడ్డుకట్ట వేయడం కోసం సమంత కోర్టును ఆశ్రయించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అక్కినేని మూడో తరం వారసుడుడైన నాగచైతన్యని 2017 అక్టోబర్ 7న సమంత పెళ్లి చేసుకున్న తరువాత తన ఇమేజ్ కాస్త రెట్టింపు అయిపోయింది. పెళ్ళికి ముందు కూడా మంచి హిట్సే ఉన్నా.. పెళ్లి తరువాత మాత్రం వరుస బ్లాక్ బస్టర్స్ తో కెరీర్ లో పీక్స్ స్టేజికి వెళ్ళిపోయింది స‌మంత‌