Love Story: లవ్ స్టోరీ సినిమా అంత పెద్ద హిట్ కావ‌డానికి స‌మంత కూడా కార‌ణ‌మా?

Love Story: అక్కినేని నట వారసుడు నాగచైతన్య, టాలెంటెడ్ నటి సాయిపల్లవి నటించిన లవ్ స్టోరి చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్స్ వ‌ర్షం కురిపిస్తుంది. సెప్టెంబ‌ర్ 24న విడుద‌లైన ఈ చిత్రం వసూళ్ల సత్తాను చాటుకొన్నది. చిన్నారులపై లైంగిక దాడులు, అలాగే కుల, మతాల వివక్ష కథాంశంగా శేఖర్ కమ్ముల లవ్ స్టోరిని తెరకెక్కించారు. సాయిపల్లవి అగ్రకుటుంబానికి చెందిన యువతిగా, నాగచైతన్య దళిత కుటుంబానికి చెందిన యువకుడిగా నటించారు.

Samantha is Also one of the Reason Behind Love Story Success
Samantha is Also one of the Reason Behind Love Story Success

తెలుగు రాష్ట్రాల్లో లవ్ స్టోరి మూవీకి సంబంధించి మూడో రోజున తె రూ.5.19 లక్షల నికర వసూళ్లు, రూ.9.10 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. గత మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.17.40 కోట్లు నికర వసూళ్లు, రూ.28.23 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లో కూడా లవ్ స్టోరి సినిమాకు మంచి స్పందన, వసూళ్లు కనిపిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో రూ.17.40 కోట్లు నికర వసూళ్లు, రూ.28.23 కోట్ల గ్రాస్, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం 92 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో సుమారు రూ.4 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.22.07 కోట్లు నికర, రూ.37.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇప్పటికే ఈ చిత్రం రూ.22.07 కోట్లు వసూలు చేసింది. అంటే ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ఇంకా రూ.9.93 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది.

Samantha is Also one of the Reason Behind Love Story Success
Samantha is Also one of the Reason Behind Love Story Success

ఈ సినిమా ఇంత హిట్ కావ‌డానికి మూడు కార‌ణాలు అని చెప్ప‌వచ్చు. చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చిరంజీవి, ఆమీర్ ఖాన్ రావ‌డంతో అంద‌రి దృష్టి ప‌డింది. ప్ర‌మోష‌న్స్ కూడా భారీగా నిర్వ‌హించారు. ఇక ఈ సినిమాకి పోటీగా మరే సినిమా విడుద‌ల కాక‌పోవ‌డం కూడా మూవీ విజ‌యంలో స‌గ భాగం అని చెప్ప‌వ‌చ్చు.

ఇక స‌మంత కూడా చిత్ర విజ‌యంలో భాగ‌మైంద‌నే చెప్పాలి. స‌మంత‌-చైతూ రిలేష‌న్‌పై కొన్నాళ్లుగా ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం, దానిపై స‌మంత సైలెంట్‌గా ఉండ‌డం, అయితే ల‌వ్ స్టోరీ రిలీజ్ అప్పుడు చైతూ ట్వీట్‌ని షేర్ చేస్తూ ట్వీట్ చేయ‌డం సినిమాపై ఆస‌క్తిని పెంచిద‌నే చెప్పాలి. నిస్సందేహంగా, సమంత ఈ సినిమా ప్ర‌మోష‌న్‌కి పరోక్షంగా దోహదపడింది.