Samantha : హాలీవుడ్ చిత్రంలో బై సెక్సువ‌ల్‌గా క‌నిపించ‌నున్న స‌మంత‌

Samantha : నాగ చైత‌న్య‌ని వివాహం చేసుకొని అక్కినేని కోడ‌లిగా ప్ర‌మోష‌న్ అందుకున్న స‌మంత సెల‌క్టివ్‌గా సినిమాలు చేసింది. చాలా ప‌ద్ద‌తిగా న‌డుచుకుంటూ ముందుకు సాగిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాత్రం త‌గ్గేదేలే అంటుంది. వరుస సినిమాలకు ఓకే చెబుతూ బిజీగా మారిపోయింది. ఓవైపు తెలుగు, తమిళంలో నటిస్తూనే బాలీవుడ్‌ వైపు కూడా అడుగులు వేస్తోందీ బ్యూటీ.

TheNewsQube-
Samantha in hollywood movie
Samantha in hollywood movie

ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్‌ 2 వెబ్‌ సిరీస్‌తో బాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది అక్కడ కూడా అవకాశాలను సొంతం చేసుకుంటోంది. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ చిత్రంలో సమంత తొలిసారి ఐటెం సాంగ్‌లో కనిపించనుంది. ఇందుకోసం సమంతకు భారీగానే ముట్టజెప్పనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

Samantha in hollywood movie
Samantha in hollywood movie

ఇక స‌మంత హాలీవుడ్ చిత్రంలోను న‌టించ‌నుండ‌గా, ఓ బేబీ చిత్రాన్ని నిర్మించిన సునీత తాటి నిర్మాతగా వ్యవహరించనున్న ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ అనే హాలీవుడ్‌ చిత్రంలో స‌మంత స్ట‌న్నింగ్ పాత్ర పోషించ‌బోతుంది.2004లో వచ్చిన అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నారట. ఇందులో సమంత ఓ బైసెక్సువల్‌గా నటిస్తుందట.

Samantha in hollywood movie
Samantha in hollywood movie

తమిళ అమ్మాయి, సంప్రదాయబద్దంగా పెంచిన కుటుంబం, కానీ తన స్వతంత్ర ఆలోచనలతో పెరిగే అమ్మాయి పాత్రలో కనిపిస్తుందట. ఇంట్లో అరేంజ్ మ్యారేజ్ చేయాలని ఒత్తిడి ఉంటుందట. కానీ సమంత పాత్ర మాత్రం తన సొంత ఆలోచనలతో జీవితాన్నిఎంచుకుంటుందట.

మొత్తానికి ఈ పాత్ర ఎంతో చాలెంజింగ్ అని, ఇందులో నటించడం సవాల్‌తో కూడుకున్న పని సమంత చెప్పుకొచ్చింది. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ తన సినిమా విశేషాలను పంచుకుంది. ఓ బేబీ తరువాత మళ్లీ సునీతతో పని చేయడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది.