Samantha : ఇది పక్కా.! ‘హిట్’ యూనిర్స్‌లో సమంత ఫిక్స్.!
NQ Staff - December 6, 2022 / 09:53 PM IST

Samantha : ‘హిట్’ యూనివర్స్ నుంచి ఇప్పటికే రెండు సినిమాలొచ్చాయ్. గతంలో విశ్వక్ సేన్, ఇప్పుడేమో అడివి శేష్.! ముందు ముందు అడివి శేష్‌తోపాటు నాని కూడా.! ఆ తర్వాత లిస్టులో ఎవరు.? ఇలా రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వస్తున్నాయి.
‘హిట్-3’ ఎప్పుడొస్తుందన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్. నిజానికి, ఆ సినిమా ఇంకా ప్రారంభం కావాల్సి వచ్చింది. ‘ప్రతి యేడాదీ డిసెంబర్లో హిట్ యూనివర్స్ నుంచి ఓ సినిమా విడుదల చేయాలి..’ అని జక్కన్న సూచించిన దరిమిలా, నిర్మాత నాని కూడా అదే మాటకు కట్టుబడి వుంటాడేమో.
సమంతతో సంప్రదింపులు షురూ…
ప్రస్తుతం అనారోగ్యం నుంచి కోలుకునే పనిలో పడింది సమంత. ఆమె పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పట్టొచ్చు. అయితే, ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి సమంత ఎప్పుడూ సిద్ధమే. పైగా, నాని అడిగితే సమంత కాదంటుందా.?
‘హిట్-3’లో సమంత నటించడం దాదాపు ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. సమంత చేస్తే, ఆ ప్రాజెక్ట్ నెక్ట్స్ లెవల్‌కి వెళుతుంది కూడా. అయితే, సమంత పాజిటివ్ రోల్ కంటే నెగెటివ్ రోల్ చేస్తే కిక్కు.. అన్నది మెజార్టీ అభిప్రాయం.
‘హిట్-3’ పట్టాలెక్కడానికి చాలా సమయం వుంది గనుక, ఈలోగా అన్ని విషయాలపై స్పష్టత వచ్చేయొచ్చు.