Samantha : గోవా ఉత్స‌వాల‌లో పాల్గొన్న స‌మంత‌.. ఆ సంగ‌తులు గుర్తు చేసుకొని ఎమోష‌న‌ల్‌

Samantha : టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రైన స‌మంత అరుదైన గౌర‌వం ద‌క్కించుకుంది. గోవాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 52వ ‘భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం’ (ఇఫీ)లో పాల్గొన్న స‌మంత ఈ కార్య‌క్ర‌మలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ‘ఫ్యామిలీమ్యాన్‌–2’ వెబ్‌సిరీస్‌లోని క్లిష్టమైన యాక్షన్‌ పాత్ర రాజీని తాను ఎంచుకోవడానికి కారణాన్ని అలా వివరించారు.

samantha IN goa film festival
samantha IN goa film festival

రాజ్, డీకే నన్ను వ్యక్తిగతంగా కలవకుండానే, అందులోని యాక్షన్‌ పాత్రకు నన్ను ఎంచుకున్నారు. తీరా నన్ను కలిశాక, వారికి తమ తప్పు దిద్దుకొనే టైమ్‌ దాటిపోయింది. కొత్తదనం కోసం తపిస్తున్న నేనూ ఆ పాత్రను ఠక్కున పట్టేసుకున్నా’’ అన్నారు సమంత. ‘‘తెలుగు పరిశ్రమ, హైదరాబాద్‌ నా పుట్టినిల్లు. నటిగా నాకు ఈ స్థానాన్ని ఇచ్చింది అవే. నేనింకా హిందీ సినిమాలేవీ చేయలేదు కానీ, ఉత్తరాది పరిశ్రమకూ, దక్షిణాదికీ పెద్ద తేడా ఏమీ లేదు’’ అన్నారు.

samantha IN goa film festival
samantha IN goa film festival

‘‘సినిమా, ఓటీటీ దేనికదే. చీకటి హాలులో అంతరాయాలకు దూరంగా చూసే సినిమాతో పోలిస్తే, ఇంట్లో టీవీలో అనేక అంతరాయాల మధ్య చూసే ఓటీటీ వెబ్‌ సిరీసుల్లో ప్రేక్షకులను కదలకుండా కూర్చోబెట్టి, మెప్పించడం చాలా కష్టం. రొటీన్‌కు భిన్నమైన భావోద్వేగాలనూ, పాత్రలనూ పండించేందుకు నటీనటులకు కూడా ఓటీటీ ఓ అవకాశం, పెద్ద సవాలు’’ అని సమంత తన మనసులో మాటను పంచుకున్నారు.

దర్శకులు రాజ్‌ అండ్‌ డీకే మాట్లాడుతూ, ‘‘ఆ పాత్రకు తమిళం తెలిసిన నటి కావాలనుకున్నాం. తమిళ చిత్రం ‘సూపర్‌డీలక్స్‌’, తెలుగు ‘రంగస్థలం’ చూసి, ఆ పాత్రకు సమంత సరిపోతారనుకొని, సంప్రదించాం. మా అంచనాలను మించి ఆమె చేశారు. పాత్రను పూర్తిగా మనసుకు ఎక్కించుకొని, ఆ భావోద్వేగాల్లోనే జీవిస్తూ, కొన్ని సీన్లు కాగానే ఆమె వెక్కివెక్కి ఏడ్చిన ఘటనలు మాకు ఇప్పటికీ గుర్తే. చేతులకు గాయమై రక్తం కారుతున్నా డూప్‌లు లేకుండా సమంత చేసిన ఫైట్లు చూసి, ఆశ్చర్యపోయాం’’ అన్నారు.

‘‘ఫ్యామిలీమ్యాన్‌–3’ రచన ఇంకా పూర్తి కాలేదు. మీడియాలో వస్తున్న ఊహాగానాలకు భిన్నంగా మూడో సీజన్‌ ఉండేలా ప్రయత్నిస్తున్నాం’’ అని ఈ దర్శకద్వయం వివరించింది. ‘ సెక్స్, క్రైమ్‌ అంశాలు ఓటీటీ తొలిరోజుల్లో వరదలా వచ్చినా, అవి పోయి మంచివే నిలబడతాయి’’ అని రాజ్‌ – డీకే పేర్కొన్నారు.