Samantha: ఆధ్యాత్మిక సేవ‌లో స‌మంత .. వీడియో చ‌క్క‌ర్లు

Samantha: నాగ చైత‌న్య నుండి విడిపోయిన త‌ర్వాత కొన్నాళ్లు మౌనంగా ఉన్న స‌మంత సినిమాలు, సోష‌ల్ మీడియాతో తెగ సంద‌డి చేస్తుంది. ఇక ఇంత‌క‌ముందులానే రెగ్యుల‌ర్ అప్‌డేట్స్ ఇస్తూ నెటిజ‌న్స్‌ని ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. అయితే సమంత పేరు గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది.

TheNewsQube-
Samantha in Devotional mood1
Samantha in Devotional mood1

దాదాపు ఏడేళ్ల బంధాన్ని నాగచైతన్య-సమంత తెంపేసుకున్నారు. ప్రేమించి పెళ్లాడిన ఈ జంట ఇటీవలే తాము ఇష్టపూర్వకంగా విడిపోతున్నామంటూ ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇక సమంత నాగచైతన్య విడిపోవడన్ని ఇప్పటికీ కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు.

విడాకుల తర్వాత ఇద్దరు తమ కెరీర్ లో బిజీగా ఉన్నారు. చైతన్య సినిమాలు సి చేస్తూ షూటింగ్స్ లో బిజీగా గడుపుతున్నాడు. మరో వైపు సమంత కూడా సినిమాలతో వెబ్ సిరీస్ లతో బిజీ బిజీగా గడిపేస్తుంది. ఇదిలా ఉంటే.. సమంత పై సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ పుట్టుకొచ్చాయి. తప్పంతా సామ్‌దే. ఆమెకు తల్లి కావడం ఇష్టం లేదు. అబార్షన్ చేయించుకుంది. ఆమెకు ఎఫైర్స్ ఉన్నాయ్. అందుకే చైతూ డైవోర్స్ ఇచ్చేశాడంటూ సమంతపై ట్రోల్స్‌ అటాక్ జరిగింది.

త‌నపై త‌ప్పుడు కామెంట్స్ చేసిన వారిపై చ‌ర్య‌లు చేసేందుకు స‌మంత కోర్టు మెట్లెక్కింది. అయితే తాను ఒప్పుకున్న కొన్ని ప్రాజెక్ట్స్‌కి టైం దొర‌క‌డంతో స‌మంత తీర్ధ యాత్ర‌ల‌కు వెళ్లింది . డిజైనర్‌ శిల్పారెడ్డితో కలసి పుణ్యక్షేత్రాలను దర్శిస్తుంది. ప్రస్తుతం ఆమె ఉత్తరాఖండ్‌లోని చార్ధామ్ యాత్రకు వెళ్లింది. దీనికి సంబంధించిన ఫోటోలను శిల్పారెడ్డి తన ఇన్‌స్టా స్టేటస్‌లో షేర్‌ చేసుకుంది.

అక్క‌డ స‌మంత పూజ‌ల‌లో మునిగిపోయింది. ఫ్రెండ్స్‌తో క‌లిసి పూజ‌లు చేస్తూ ఆద్యాత్మిక సేవ‌లో మునిగిపోయింది. స‌మంత కొద్ది రోజుల క్రితం తిరుప‌తిలో కూడా పూజ‌లు చేయ‌గా, అందుకు సంబంధించిన ఫొటోలు,వీడియోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేశాయి.