Samantha : బాలీవుడ్ స్టార్స్ మ‌ధ్య స‌మంత‌…అడుగులు అటు వైపు ఖాయ‌మా..!

Samantha : సౌత్ స్టార్ హీరోయిన్ స‌మంత వైఖ‌రి చూస్తుంటే ఈ అమ్మ‌డు త‌న కెరీర్‌ని చాలా బిజీగా ఉంచుకునేందుకు ప్ర‌యత్రిస్తుంది. ఇప్ప‌టికే శాకుంత‌లం చిత్ర షూటింగ్ పూర్తి చేసిన స‌మంత ఇప్పుడు ప‌లు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. బాలీవుడ్ సినిమాల‌పై దృష్టి పెడుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో సమంత బాలీవుడ్ స్టార్స్ తో కలిసి రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో పాల్గొన‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Samantha going to bollywood soon
Samantha going to bollywood soon

ప్రముఖ హోస్ట్ కమ్ ప్రజెంటర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అయిన అనుపమ చోప్రా నిర్వహించిన విభిన్నమైన రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో సమంత పాల్గొనడం సౌత్ లో చర్చనీయాంశం అయ్యింది. బాలీవుడ్ స్టార్స్ మాత్రమే ఉన్న ఆ టీమ్ లో సమంత కూడా జాయిన్ అవ్వడం చూస్తుంటే ఇప్పటికే బాలీవుడ్ లో ఆమె జర్నీ స్టార్ట్ అయినట్లుగా అనిపిస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.

Samantha going to bollywood soon
Samantha going to bollywood soon

బాలీవుడ్ స్టార్స్ విక్కీ కౌశల్.. సిద్దార్థ్ మల్హోత్ర.. సన్య మల్హోత్ర లతో పాటు తాప్సి మరియు సమంతలు రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున బాలీవుడ్ లో చర్చనీయాంశం అయిన ఈ ఇంటర్వ్యూ కు ముందు తాప్సి మరియు సమంతలు కలిసి ఫొటోలకు ఫోజ్ ఇచ్చారు.

ఇంటర్వ్యూకు ముందు మరియు ఆ తర్వాత జరిగిన పరిణామల గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. తాప్సి మరియు సమంతలు కలిసి వెళ్లడం.. కలిసి రావడం కాస్త చర్చనీయాంశంగా మారింది. సమంత హీరోయిన్ గా తాప్సి నిర్మాణంలో ఒక సినిమా బాలీవుడ్ లో రూపొందబోతున్నట్లుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.

ఆ కారణంగానే ఇద్దరు కలిసి జర్నీ చేస్తున్నారంటూ ఇద్దరి కాంబో సినిమాపై మరింత స్పష్టత వచ్చినట్లు అయ్యిందని మీడియా వర్గాల వారు అంటున్నారు. సినిమా మొదలు పెట్టేది ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. సమంత బాలీవుడ్ లో ఇప్పటికే రెండు మూడు ప్రాజెక్ట్ లను ఓకే చేసింది.

సౌత్ నుండి మెల్ల మెల్లగా సమంత దూరం అవ్వాలని భావిస్తున్నట్లుగా ఆమె చర్యలను చూస్తుంటే అనిపిస్తుందని కొందరు నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.