Shakuntalam : శాకుంతలం ప్రమోషన్‌ లో గుణశేఖర్‌ ఫెయిల్‌ అయ్యాడా?

NQ Staff - January 26, 2023 / 11:20 PM IST

Shakuntalam : శాకుంతలం ప్రమోషన్‌ లో గుణశేఖర్‌ ఫెయిల్‌ అయ్యాడా?

Shakuntalam : సమంత హీరోయిన్‌ గా నటించిన శాకుంతలం సినిమా యొక్క విడుదల తేదీ దగ్గర పడుతోంది. వచ్చే నెల విడుదల కాబోతున్న శాకుంతలం సినిమా యొక్క పబ్లిసిటీ కార్యక్రమాల విషయంలో దర్శకుడు గుణశేఖర్‌ పెద్దగా యాక్టివ్‌ గా లేడు అంటూ విమర్శలు వస్తున్నాయి. అదుగో ఇదుగో అంటూ చాలా మంది చాలా రకాలుగా శాకుంతలం గురించి ఊహించుకున్నారు.

ఆ స్థాయిలో శాకుంతలం సినిమా ను ప్రమోట్ చేయడం లేదు అంటూ గుణశేఖర్ తీరుపై సినీ ప్రముఖులు విమర్శలు చేస్తున్నారు. సమంత ను కీలక పాత్రలో చూపిస్తూ పాన్ ఇండియా సినిమాగా శాకుంతలం ను రూపొందించడం జరిగింది. ఈ సినిమాను దిల్ రాజు సమర్పిస్తున్న కారణంగా భారీ ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సినిమా విడుదల అయినంతగా ప్రమోషన్‌ చేస్తే ఓపెనింగ్‌ విషయంలో మంచి ఫలితం దక్కే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది. శాకుంతలం సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్‌ రిలీజ్ ప్రెస్ మీట్‌ నిర్వహించారు. ఆ తర్వాత రెండు పాటలు విడుదల చేయడం జరిగింది.

ట్రైలర్ మరీ నెల రోజుల ముందుగానే విడుదల చేయడంను చాలా మంది తప్పుబడుతున్నారు. విమర్శిస్తూ చాలా మంది గుణశేఖర్‌ ప్లానింగ్‌ లేకుండా వ్యవహరిస్తున్నాడు అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తానంటూ చెబుతున్న గుణశేఖర్‌ ప్రమోషన్ తీరు ఇదేనా అంటూ పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us