SAMANTHA: సమంతను దూరం పెడుతున్నారా.. దూరం అవుతుందా అంటూ అభిమానుల ప్ర‌శ్న‌లు

ఇప్పుడు అభిమానులకు ఇదే అనుమానం వస్తుంది మరి. ఒకప్పుడు వరస సినిమాలు చేసిన సమంత ఇప్పుడు ఎందుకు అసలు కనిపించడం లేదంటూ ఆమె వీరాభిమానులు అడుగుతున్నారు. అసలు ఏమంది మా సమంతకు.. అవకాశాలు ఇవ్వడం లేదా.. ఇచ్చినా కూడా ఈమె ఒప్పుకోవడం లేదా ఏదో ఒకటి మాకు చెప్పండి క్లారిటీ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పదేళ్లుగా వరస సినిమాలు చేసిన సమంత.. కొన్నేళ్లుగా అసలు కనిపించడం మానేసింది. అడపా దడపా సినిమాలు సైన్ చేయడం మినహాయిస్తే ఒకప్పట్లా వరస సినిమాలు మాత్రం చేయడం లేదు.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగానే ఉంది. పెళ్లికి ముందు సైన్ చేసిన సినిమాలు పూర్తి చేసిన సమంత.. ఆ తర్వాత భర్త నాగ చైతన్యతోనే మజిలీ సినిమా చేసింది. దాంతో పాటు మరో రెండు మూడు సినిమాలకు కమిట్ మెంట్ ఇచ్చింది. వాటిని కూడా త్వరగానే పూర్తి చేసింది సమంత. పెళ్లి తర్వాత చరణ్‌తో కలిసి నటించిన రంగస్థలం సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. అయితే రంగస్థలం తర్వాత స్టార్ హీరోలు మాత్రం తమ సినిమాల్లో సమంతను హీరోయిన్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. మరోవైపు సమంత కూడా పెళ్లి తర్వాత గ్లామర్ రోల్స్ చేయడానికి నో అంటుంది.

అందుకే అవకాశాలు కూడా రావడం లేదు. ఈ మధ్య ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ కథల వైపు అడుగులు వేస్తుంది స్యామ్. చాలా రోజుల తర్వాత ఈ మధ్యే సమంత ఒప్పుకున్న సినిమా శాకుంతలం. రుద్రమదేవి తర్వాత గుణశేఖర్ చేస్తున్న సినిమా ఇది. పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాలో సమంతకు జోడీగా మలయాళ హీరో దేవ్ మోహన్ నటిస్తున్నాడు. ఏదేమైనా కూడా ఒకప్పట్లా సమంత సినిమాలు చేయడం లేదనేది మాత్రం కాదనలేని వాస్తవం.

Advertisement