Samantha : స్టార్ హీరోతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న సమంత.. ఏదో తేడాగా ఉందే..!
NQ Staff - April 1, 2023 / 11:00 AM IST

Samantha : సౌత్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా సమంతకు మంచి క్రేజ్ ఉంది. ఎలాంటి పాత్రలో అయినా సరే ఆమె ఒదిగిపోయి నటిస్తుంది. నటనలో ఆమెను కొట్టే హీరోయిన్ లేదనే చెప్పుకోవాలి. అలాంటి సమంతకు సంబంధించిన ఏ చిన్న న్యూస్ అయినా సరే జనాలకు చాలా ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. మొన్నటి వరకు ఆమె మయోసైటిస్ వ్యాధితో చాలా బాధ పడింది.
ఇక ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటోంది. ఆమె నటించిన శాకుంతలం మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఆమె మూవీ ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటోంది. అదే సమయంలో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ సినిమాలో నటిస్తుంది. ఇందులో విజయ్ భార్యగా సమంత నటించబోతోంది.
అయితే ప్రస్తుతం కేరళలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ టీమ్.. షూట్ మధ్యలో అక్కడ ఉండే అందమైన లొకేషన్లను ఎంజాయ్ చేస్తున్నారు. సమంత కూడా విజయ్ దేవరకొండతో కలిసి అక్కడి లొకేషన్లలో ఎంజాయ్ చేస్తోంది. ఆమె ఇలా స్టార్ హీరోతో ఎంజాయ్ చేయడానికి సంబంధించిన ఫొటోలను ఇన్ స్టాలో పోస్టు చేస్తోంది.

Samantha Enjoying Kerala Locations With Vijay Deverakonda
ఈ ఫొటోల్లో ఆమె మెడలో తాళి కూడా కనిపిస్తోంది. ఇది చూసిన నెటిజన్లు సమంతపై షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు. ఏంటి విజయ్ తో లవ్ లో పడ్డావా.. అతన్ని పెండ్లి చేసుకుంటావా.. రష్మికకు అన్యాయం చేయకు అంటూ ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు. సమంత కూడా విజయ్ తో చాలా క్లోజ్ గా తిరగడాన్ని బట్టి చూస్తుంటే.. ఏదో జరుగుతోందని అంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.