Samantha: రాజీ పాత్రతో డేరింగ్ లేడీ అనిపించుకున్న సామ్.. భావోద్వేగమైన పోస్ట్ పెట్టిన సమంత

Samantha: సమంత.. యాక్టింగ్ కే బ్రాండ్ అంబాసిడర్ ఆమె. విభిన్నమైన కథలు.. విలక్షణమైన నటన ఆమె సొంతం.. పాత్ర ఎలాంటిదైనా సరే ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తుంది. తన నటనా చాతుర్యంతో నవ్వించేస్తుంది. అంతేనా తల్లి పడే ఆవేదనను పంచుతుంది. సమంతకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా, ఏ సినిమాకైనా ఇట్టే అల్లుకుపోతుంది. రంగస్థలం సినిమాలో డీ గ్లామరస్ రోల్ లో నటించి ప్రేక్షకుల్ని మైమరపించింది. సమంత లాంటి మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు ఆమె అభిమానులు. వెండితెరపై ఇప్పటివరకు తన టాలెంట్ చూపిన సమంతా ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లాంటి వెబ్ సిరీస్ తో డిజిటల్ మీడియాకు ఎంట్రీ ఇచ్చింది.

Samantha

రీసెంట్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజైన ఈ వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. దీనిపై సోషల్ మీడియాలో సమంత యాక్ట్ చేసిన పాత్రపై పలు పాజిటివ్ రివ్యూలు, కమెంట్ లు పోస్ట్ చేస్తున్నారు. వీటన్నింటిపై సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో స్పందిస్తూ.. మీ అభిమానానికి, పాజిటివ్ రివ్యూలు చూస్తుంటే మనసుకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని తెలిపింది. తెలుగు వాళ్ళైన రాజ్ నిడమోరు, కృష్ణ డీకే తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ లో సమంత శ్రీలంకన్ తమిళ లిబరేషన్ ఫైటర్ రాజీగా కనిపించారు. ఈ పాత్ర పూర్తిగా డీగ్లామరస్ రోల్. అయినా కూడా ఎంతో జాగ్రత్తగా నటించారు. అందుకే ఈ పాత్ర తనకెంతో ప్రత్యేకమని చెబుతుంది సమంతా. బాలీవుడ్ లో విలక్షణ పాత్రలతో మెప్పించిన నటుడు మనోజ్ బాజ్ పేయి. ఫ్యామిలీ మెన్ సీజన్ 1 తో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ సీజన్ లో కూడా ఆయనే మెయిన్ లీడ్ రోల్. ఆయనతో కలిసి వర్క్ చేయడం మరింత ఆనందాన్నిచ్చిందని అన్నారు.

Samantha

ద్వేషం, అణచివేతకు వ్యతిరేకంగా గళమెత్తిన పాత్రలో సమంత నటన ఎంతో అద్భుతమని, అలాంటి పాత్ర చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలని అంటున్నారు ఆమె ఫ్యాన్స్. ఈలం యుద్ధంలో మహిళల పాత్ర, శ్రీలంకలో తమిళుల పోరాటానికి సంబంధించిన ఎన్నో డాక్యుమెంటరీలను, ముఖ్యంగా రాజీ పాత్ర ఈ వెబ్ సిరీస్ కి ఎంతో ముఖ్యం అని అన్నారు. కొన్ని దశాబ్దాలుగా శ్రీలంక తమిళులు పడిన బాధలు తనను కంటతడి పెట్టించాయని తన పోస్ట్ లో వివరించారు. ఆ యుద్ధం తాలుకు చేదు గుర్తులతో జీవిస్తున్న వారికి రాజీ స్టోరీ ఓ నివాళి అని ఆమె పోస్ట్ చేసింది.