Samantha: స‌మంత ఎర్లీ మార్నింగ్ వ‌ర్క‌వుట్.. అవాక్క‌వుతున్న అభిమానులు

Samantha: చూడ‌చ‌క్కని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ స‌మంత‌. ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ త‌న ప‌ర్స‌న‌ల్, ప్రొఫెష‌న‌ల్ విష‌యాలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవ‌లి కాలంలో స‌మంత త‌న పోస్ట్‌ల ద్వారా హాట్ టాపిక్‌గా మారుతుంది. తాజాగా స‌మంత షేర్ చేసిన వీడియో అందరు అవాక్క‌య్యేలా చేస్తుంది.

samantha moring workout
samantha moring workout

చైతూ నుండి విడిపోయిన త‌ర్వాత స‌మంత సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టింది. స్టార్టింగ్ లోనే ‘ఊ అంటావా’ అంటూ ప్రేక్షకులను తన మత్తులో ముంచేసిన ఈ బేబీ ఇప్పుడు తన ఫిజిక్, ఫిట్నెస్ పై దృష్టి పెట్టింది. ఇప్పుడు బాలీవుడ్ తో పాటు రెండు పాన్ ఇండియా సినిమాలు, రెండు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ చేతిలో ఉండడంతో వాటిపై పూర్తిగా దృష్టి సారించింది.

ఈ మేరకు మెరుపు తీగలా మారి, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడానికి జిమ్ లో తీవ్రంగా కష్టపడుతోంది ఈ అమ్మడు. రీసెంట్‌గా ఆమె జిమ్ లో చేసిన హెవీ ఇంటెన్స్ వర్కౌట్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది.తాజాగా స‌మంత ఎర్లీ మార్నింగ్ వీడియో అంటూ ఒక వీడియో షేర్ చేయ‌గా, ఇది నెటిజ‌న్స్ ని ఆక‌ట్టుకుంటుంది.

బాడీ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే సమంత తన శరీరాకృతి కోసం జిమ్‌లో కష్టపడేందుకు తనని ప్రోత్సహిస్తూ మోటీవేట్‌ చేసే సీక్రెట్‌ను ఇటీవ‌ల‌ రివీల్‌ చేసింది. సామ్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఏంటంటే సమోసా అంట. అవును తనకు సమోసాలు అంటే మహా ఇష్టమట, కానీ ఫిట్‌నెస్‌ దృష్ట్యా వాటిని తినలేకపోతోందట. అందుకే సమోసాను ఎదురుగా పెట్టుకుని జిమ్‌లో వర్కౌట్స్‌ చేస్తుందట సామ్‌.

స‌మంత‌ గ్లామర్‌కు ఎంతమంది ఫ్యాన్స్‌ ఉన్నారో తన ఫిటనెస్‌ కూడా అంతే రేంజ్‌లో ఫాలోవర్స్‌ ఉన్నారు. ఇక ఆమె ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అనే విషయం అందరికి తెలిసిందే. జీమ్‌లో వర్కౌట్స్‌ చేస్తూ తెగ కష్టపడుతూ జీరో సైజ్‌ను అలా మెయింటెన్‌ చేస్తోంది.

samantha moring workout
samantha moring workout