Samantha: స‌మంత స్టైలిస్ట్‌కి నాగ చైత‌న్య ఫ్యాన్స్ బెదిరింపులు.. మౌనం వీడాల‌ని కామెంట్

Samantha: టాలీవుడ్ క్యూటెస్ట్‌ కపుల్‌ నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారం ఇప్ప‌టికీ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. విడాకుల త‌ర్వాత స‌మంత ఆమె స్టాఫ్‌ని టార్గెట్ చేస్తూ నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.ముఖ్యంగా చై-సామ్‌ విడిపోవడానికి సమంత స్టైలిష్ట్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌ వల్ల వీరిమధ్య మనస్పర్థలు వచ్చాయని, సమంత, ప్రీతమ్‌ చాలా సన్నిహితంగా ఉండటమే విడాకులకు దారి తీసిందంటూ కొందరూ కామెంట్‌ చేశారు.

త‌ను ఏం త‌ప్పు చేయ‌లేద‌ని, స‌మంత‌ని అక్క అని పిలుస్తాను అని తాను చెప్పిన కూడా ఎవ‌రు విన‌డం లేదు. ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై, సమంతపై వస్తున్న రూమార్లపై పెదవి విప్పాడు. ‘నేను సమంతను అక్క అని పిలుస్తాను. చాలా మందికి అది తెలుసు. అలాంటిది మా మధ్య ఎఫైర్ ఎందుకు ఉంటుంది. ఐ లవ్యూ అని సోషల్ మీడియాలో ఎందుకు కామెంట్ చేశావని చాలా మంది అడుగుతున్నారు.

కుటుంబ సభ్యులకు, సోదరిగా భావించే వారికి ఐ లవ్యూ చెప్పడం తప్పెలా అవుతుంది. ఎంతో మంది నన్ను ఆసభ్య పదజాలంతో తిడుతూ మెసేజ్‌లు చేస్తున్నారు. నాగ చైత‌న్య అభిమానులు కొంద‌రు ఇంటి నుంచి బయటకు వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. నా కెరీర్‌ను నాశనం చేస్తామని హెచ్చరిస్తున్నారు. బతికుండగానే మా అమ్మ చనిపోయిందని కొన్ని వెబ్‌సైట్లు రాస్తున్నాయి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

స‌మంత,నేను ఎలా ఉంటామో నాగ చైత‌న్యకు తెలుసు. నాకు, సమంతకు ఎఫైర్ ఉందని వస్తున్న కామెంట్ల గురించి నాగచైతన్య స్పందించకపోవడం చాలా బాధ కలిగిస్తోంది. ఆయన ఒక్క స్టేట్‌మెంట్ ఇస్తే పరిస్థితిలో చాలా మార్పు వస్తుంది. ఫ్యాన్స్ పేరుతో కామెంట్లు చేస్తున్న వారిని అదుపులో పెట్టేందుకు నాగచైతన్య కచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి. ప్రస్తుతం సమంత విషాదంలో ఉంది. ఆమెకు నా మ‌ద్దతు ఉంటుంది. నేను ట్రోలింగ్‌కు నేను భయపడను’ అంటూ ప్రీతమ్ చెప్పుకొచ్చాడు.