Samantha: ఆ ఛానెల్‌కి ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌నుంటూ తెగేసి చెప్పిన స‌మంత‌

Samantha: అక్కినేని నాగ చైత‌న్య నుండి విడిపోయాక స‌మంత ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆమె చేతిలో మూడు సినిమాలు ఉన్నాయ‌ని అంటున్నారు. అయితే చైతూ నుంచి విడాకులు ప్రకటించిన త‌ర్వాత సమంత హైదరాబాద్ ఇంటిలోనే నివశిస్తున్నారు. చైతన్యతో కలిసి ఇదే ఇంటిలో జీవితం సాగినప్పటికీ సామ్ తన గచ్చిబౌలి ఇంటిలో ఇంకా నివశించడంపైనా అభిమానులు ఆరాలు తీస్తున్నారు.

Samantha

అయితే సమంత అన్నిటి నుంచి బయటపడేందుకు ఇప్పుడు ధైర్యంగా బయటకు రావాలని .. త్వరలో తన నటవృత్తిలో తిరిగి బిజీ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే విడాకుల త‌ర్వాత స‌మంత‌ని ఓ ప్రముఖ ఛానెల్ టార్గెటెడ్ గా ప్రసారం చేసింది. సామ్-చై ప్రేమ పెళ్లిపై ప్రత్యేక కథనాలు..అటుపై ఇద్దరి మద్య సాగిన బంధం గురించి..ఆ తర్వాత వివాదం మొదలైన నాటి నుంచి ఇద్దరి మధ్య పెరిగిన దూరం గురించి ఆసక్తికర కథనాల్ని ప్రసారం చేసింది.

ఇలాంటి కథనాలేవీ తన జీవితాన్ని ఏమీ చేయలేవని సమంత హెచ్చరించింది. అయితే అదే ఛానల్ తర్వాత సమంతతో ఇంటర్వ్యూ కోసం విశ్వ ప్రయత్నాలు చేసిందిట. కాని స‌మంత స‌సేమీరా అని అన్న‌ద‌ని టాక్. ఇక సమంత విడాకుల తర్వాత సామ్ మేకప్ ఆర్టిస్ట్ సద్నా సింగ్ కాసేపటికే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

సమంతకు ఫ్యామిలీ లైఫ్ అంటే ఎంతో ఇష్టమని..పిల్లల్ని కని జీవితంలో స్థిరపడాలని ఎంతో ఆశపడిందని తెలిపింది. అందుకోసం సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో ఎన్నో పెద్ద అవకాశాలు వచ్చినా కాదనుకుంది. ఫ్యామిలీ మ్యాన్ -2 తర్వాత సమంతకు పెద్ద ప్రొడక్షన్ హౌస్ ల్లో స్టార్ హీరోలతో నటించే చాన్స్ వచ్చింద“ని తెలిపింది.