SAMANTHA : అక్కినేని కోడలు సమంత ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతి రోజు వెరైటీ డ్రెస్సులలో ఫొటోషూట్స్ చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అలరిస్తుంది. తాజాగా తన క్యూట్ లుక్స్ ఫొటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఇవి వైరల్ అవుతున్నాయి. పెళ్ళైనప్పటికీ సమంత తన అందచందాలతో అలరిస్తుండడం కుర్రకారు గుండెలలో హీట్ పెంచుతుంది.
తెలుగులో ‘ఏమాయ చేశావే’ సినిమాతో పరిచయమై కుర్రకారుని తన మాయలో పడేసిన సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్లో ఒకరుగా ఓ వెలుగు వెలుగుతున్న సమంత అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానున్న ది ఫ్యామిలీ మ్యాన్ అనే పాపులర్ వెబ్ సిరీస్ రెండవ సీజన్లో నెగెటివ్ రోల్ పోషించింది. ఫిబ్రవరిలో ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం చిత్రంలోను శకుంతల పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
