Samantha: క్యూట్ లుక్‌లో స‌మంత‌.. అందాల‌కు మ‌తులు పోతున్నాయంటున్న ఫ్యాన్స్

Samantha: పెళ్లికి ముందు, పెళ్లి త‌ర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గా కొన‌సాగిన స‌మంత విడాకుల త‌ర్వాత కూడా త‌న హ‌వా చూపిస్తుంది. చైతూ నుండి విడిపోయాక స‌మంత హ‌వా త‌గ్గుతుంద‌ని అంద‌రు అనుకున్నారు. కాని అంత‌కు మించి అనేలా ఆమె హ‌వా కొన‌సాగుతుంది. నిత్యం వార్త‌ల‌లో ఉంటూ అంద‌రి దృష్టి ఆక‌ర్షిస్తుంది.

samantha cute pics
samantha cute pics

చైతూ నుండి విడిపోయాక మె ఇన్ స్టాలో మాత్రం ప్రతి రోజూ పోస్ట్‌లు పెడుతుంది స‌మంత‌. అది సినిమాకు సంబంధించిందా? లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిదా? తన వ్యాపారానికి సంబంధించిందా? తన వర్కవుట్ల విషయాలా? అన్నది పక్కన పెడితే సమంత మాత్రం ప్రతి రోజూ పోస్ట్‌లు చేస్తూనే ఉంటుంది. ఆమె చేస్తున్న అన్ని పోస్టులు ప్రత్యేక చర్చలకు దారి తీస్తున్నాయి.

samantha cute pics
samantha cute pics

తాజాగా మరోసారి తన మానసిక సంఘర్షణ గురించి సమంత సంచలన విషయాలు బయట పెట్టింది. తాజాగా ఆమె మాటలాడిన మాటలు చర్చనీయాంశం అవుతున్నాయి. రోష్ని ట్రస్ట్ ఏర్పాటు చేసిన సైకియాట్రి ఎట్ యువర్ డోర్ స్టెప్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ జీవితంలో తాను చాలా మానసిక సమస్యలు ఎదుర్కొన్నానని పేర్కొంది.

samantha cute pics
samantha cute pics

ఇలాంటి సమయంలో నా స్నేహితులు, వైద్య సహాయం తీసుకున్నా అని పేర్కొంది. ఈరోజు ధైర్యంగా నిలబడటానికి.. జీవితంలో ముందుకు వెళ్లడానికి నా స్నేహితులు, కుటుంబం, కౌన్సిలర్ల సహాయమే కారణం అని ఆమె చెప్పుకొచ్చింది. శరీరానికి దెబ్బ తగిలితే వైద్యులను ఎలాగైతే కలుస్తామో అలాగే మనసుకు గాయం అయినప్పుడు కూడా వైద్యులను సంప్రదించాలని సమంతా చెప్పుకొచ్చారు.

samantha cute pics
samantha cute pics

కార్య‌క్ర‌మానికి సమంత స్టైలిష్ డ్రెస్‌లో మెరిసోప‌గా, ఆమె అంద‌చందాల‌కు ప్ర‌తి ఒక్క‌రు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ఎంత స‌క్క‌గున్నావే అంటూ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. స‌మంత ఈ మ‌ధ్య చాలా హాట్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిస్తూ కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.

samantha cute pics
samantha cute pics

సినిమాల విషయానికి వస్తే సమంత నటించిన శాకుంతలం సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే టాలీవుడ్ మాత్రమే కాకుండా.. బాలీవుడ్, హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది ఆమె. ఆమె ది అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ అనే అంతర్జాతీయ సినిమా ద్వారా హాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇక హిందీ హీరో వరుణ్‌ ధావన్‌ తో కలిసి అమెజాన్‌ ప్రైమ్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌’లో కూడా న‌టించ‌నుంది.