Samantha: బాల్కనీలో స‌మంత డ్యాన్స్.. క్యూట్‌గా చేస్తున్నావంటూ నెటిజ‌న్స్ కామెంట్స్

Samantha: అందాల ముద్దుగుమ్మ స‌మంత విడాకుల త‌ర్వాత మ‌ళ్లీ పాత రోజుల‌కి వెళ్లిపోయింది. సోలో లైఫ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల తన స్నేహితురాలు శిల్పా రెడ్డితో కలిసి ఆధ్యాత్మిక పర్యటనలు చేసింది. పలు పూజలు నిర్వహించింది. చెయ్ జ్ఞాపకాల నుంచి నెమ్మదిగా బయటపడేందుకు ట్రై చేస్తోంది. ప్రజంట్ వరస సినిమాలను ఒప్పుకుంటుంది.

samantha cute dance in balcony (1)
samantha cute dance in balcony (1)

తాజాగా సోష‌ల్ మీడియాలో ఆస‌క్తికర పోస్ట్‌ల‌తో పాటు ఇంట్రెస్టింగ్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బాల్క‌నీలో డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒక‌టి షేర్ చేసింది. ఇందులో స‌మంత స్ట‌న్నింగ్ డ్యాన్స్ పై నెటిజ‌న్స మైమ‌ర‌చిపోతున్నారు. క్యూట్‌గా వేస్తున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇప్పుడు ఈ అమ్మ‌డు స్పెష‌ల్ సాంగ్స్ కి కూడా సై అంటుంది. సన్నాఫ్‌ సత్యమూర్తి’తో ప్రేక్షకుల్ని అలరించిన సమంత-అల్లు అర్జున్‌ ఇప్పుడు మరోసారి మ్యాజిక్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప’లో సమంత ప్రత్యేక గీతంతో సందడి చేయనుంది.

ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ‘‘పుష్ప’ చిత్రంలోని ఐదో పాట ఎంతో ప్రత్యేకమైంది. ఈ స్పెషల్‌ సాంగ్‌కు స్పెషల్‌ వ్యక్తి ఉంటేనే బాగుంటుందనిపించింది. అలా సమంతను సంప్రదించాం. ఆమె వెంటనే ఓకే చేశారు’ అని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. తన కెరీర్‌లో సమంతకు ఇదే తొలి ఐటెమ్‌ సాంగ్‌ కానుంది.

కాగా సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్న శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తయి.. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. త‌మిళ చిత్రం కూడా ఒక‌టి విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది