Nagachaitanya-Samantha : మళ్లీ ఆ పని చేసి చైతూకు మండేలా చేసిన సమంత.. అస్సలు తగ్గట్లేదుగా..!

NQ Staff - March 12, 2023 / 12:47 PM IST

Nagachaitanya-Samantha : మళ్లీ ఆ పని చేసి చైతూకు మండేలా చేసిన సమంత.. అస్సలు తగ్గట్లేదుగా..!

Nagachaitanya-Samantha : సమంత అంటే ఇప్పుడు సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్. ఎవరి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇంత స్థాయికి ఎదగడం అంటే మాటలు కాదు. దాని వెనకాల ఆమె స్వయం కృషి ఎంతో ఉంది. దాన్ని ఎవరూ కాదనరు. అయితే సమంత ఇప్పుడు చైతూ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత చాలానే కష్టపడుతోంది. మళ్లీ తన ఇమేజ్ ను పెంచుకోవడానికి ప్రతి క్షణం ప్రయత్నాలు చేస్తోంది.

మొన్న మయోసైటిస్ వ్యాధి బారిన పడిన ఆమె.. ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి కోలుకుంటోంది. ఈ క్రమంలోనే సమంత వరుసగా మళ్లీ షూటింగుల్లో పాల్గొంటుంది. విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఖుషీ సినిమాలో ఆమె హీరోయిన్ గా చేస్తోంది. అయితే రీసెంట్ గా ఉమెన్స్ డే సందర్భంగా ఆమె సెట్ లో కేక్ కట్ చేసింది.

అతని లాంటి వారే కావాలి..

ఇందులో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు. కాగా ఈ సందర్భంగా ఆమె విజయ్ మీద ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. ప్రతి ఒక్క అమ్మాయికి విజయ్ లాంటి వ్యక్తి తోడుగా ఉండాలి.. అప్పుడు ఏ అమ్మాయికి కూడా కష్టాలు రావు అంటూ చెప్పిందంట. దాంతో ఈ కామెంట్లు కావాలనే చైతూను ఉద్దేశించి చేసిందంటున్నారు.

గతంలో కూడా విజయ్ మీద ఇలాంటి కామెంట్లే చేసింది. స్టార్ హీరోల కొడుకులు స్టార్ హీరోలు కాలేరు. కానీ విజయ్ లాంటి హీరోలు మాత్రమే ఇండస్ట్రీకి కావాలి అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇలా ఆమె ప్రతి సారి చైతూను ఇన్ డైరెక్టుగా టార్గెట్ చేస్తూ వస్తోంది అంటూ అక్కినేని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us