Samantha: అల్లు అర్జున్ భార్య‌పై స‌మంత స్ట‌న్నింగ్ కామెంట్స్.. ఆశ్చ‌ర్యంలో నెటిజ‌న్స్

Samantha: అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డికి సోష‌ల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆమె ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో కొత్త అప్‌డేట్స్ ఇస్తూనే ఉంటుంది. ఈ క్ర‌మంలో ఆమెకు ఫాలోవ‌ర్స్ విపరీతంగా పెరుగుతూ పోతున్నారు. స్నేహా రెడ్డి త‌న‌ కూతురు, కొడుకుతో కలిసి బన్ని చేసే అల్లరి ఫొటోలు, వీడియోలను స్నేహా రెడ్డి తరుచూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు.

ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ యాక్టివ్‌గా ఉండే స్నేహ ఫాలోవర్లు కూడా ఎక్కువే. తాజాగా స్నేహరెడ్డి కొన్ని ఫోటోలను షేర్‌ చేశారు. మల్హోత్ర డిజైన్ చేసిన నలుపు రంగు చీరలో స్నేహ ఎంతో అందంగా కనిపించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లాగే ఆయన భార్య స్నేహా రెడ్డి కూడా చాలా స్టైలిష్.

ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండీ ఫ్యాషన్ ఔట్‌ఫిట్స్‌‌ను ఫాలో అవుతుంటారు. ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటారు. తాజాగా ట్రాన్స్పరెంట్ బ్లాక్ శారీలో దిగిన ఫోటోలను స్నేహారెడ్డి తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. సమంత స్టైలిస్ట్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌ స్నేహకు స్టైలింగ్‌ చేశారు.

దీనికి సంబంధించిన ఫోటోలను స్నేహరెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా పలువురు సెలబ్రిటీలు సైతం స్నేహపై ప్రశంసలు కురిపించారు. స్టార్‌ హీరోయిన్‌ సమంత సైతం హాట్‌.. అంటూ కామెంట్‌ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

కాగా అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ సినిమాలో సమంత స్పెషల్‌ సాంగ్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక పుష్ప సినిమా తొలి రోజు స్నేహా రెడ్డి త‌న భ‌ర్త‌తో క‌లిసి ఆర్టీసీ క్రాస్ రోడ్ థియేటర్స్‌కి వెళ్లి సినిమాని వీక్షించిన విష‌యం తెలిసిందే.