Samantha: ప్రెగ్నెన్సీపై స‌మంత స్ట‌న్నింగ్ స‌మాధానం.. విని అంద‌రు ఆశ్చ‌ర్యం

Samantha: ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన అందాల ముద్దుగుమ్మ స‌మంత‌. ఈ సినిమా త‌ర్వాత వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా మారింది. ఇక 2017లో చైతూతో ఏడ‌డుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ గ‌త ఏడాది అక్టోబ‌ర్ 2న విడాకుల ప్ర‌క‌టన చేసింది.

Samantha Clarity on Pregnancy Rumours
Samantha Clarity on Pregnancy Rumours

చైతూ నుండి స‌మంత విడిపోయిన త‌ర్వాత ఆమెపై ఎన్నో విమ‌ర్శ‌లు వ‌చ్చినా బ‌లంగా త‌ట్టుకుంది. అయితే ఓ వాద‌న బ‌లంగా వినిపించింది. స‌మంత‌ను పిల్ల‌లు క‌న‌మంటూ అక్కినేని కుటుంబ స‌భ్యులు ఒత్తిడి చేశార‌ని.. కానీ, పిల్ల‌ల‌ను కంటే అందం దెబ్బ తిని సినిమా అవ‌కాశాలు త‌గ్గిపోతానే కార‌ణంతోనే చైతుకు ఆమె విడాకులు ఇచ్చేసింద‌ని ప్ర‌చారం జ‌రిగింది.

ఈ క్ర‌మంలోనే కొంద‌రు నెటిజ‌న్లు గర్భధారణకు మీరు వ్యతిరేకమా అంటూ కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా సామ్‌ను ప్ర‌శ్నించారు. అప్పుడు స‌మంత స్ట‌న్నింగ్ స‌మాధానాలు ఇచ్చింది. ఇక తాజాగా స‌మంత‌కు మీరు ప్రెగ్నెంట్ అని అడిగితే షాకింగ్ ఆన్స‌ర్ ఇచ్చింది.

నేను 2017 నుండి గర్భవతిని. ఈ పాప నిజంగా బయటకు రావాలని కోరుకోవడం లేదు, అంటూ సెటైరిక‌ల్‌గా చెప్పింది స‌మంత‌. ప్ర‌స్తుతం స‌మంత చేసిన కామెంట్స్ ఇండ‌స్ట్రీతో పాటు అభిమానుల‌లో కూడా హాట్ టాపిక్‌గా మారాయి. ఇదిలా ఉంటే రీసెంట్‌గా కాజ‌ల్ ఓ వీడియో ద్వారా గుడ్‌న్యూస్‌ను షేర్ చేసుకుంది. దీంతో ఆమెకు విషెస్ వెల్లువెత్తాయి

Samantha Clarity on Pregnancy Rumours
Samantha Clarity on Pregnancy Rumours

ఈ నేప‌థ్యంలోనే కాజ‌ల్ ప్రెగ్నెన్సీపై సామ్ కూడా స్పందిస్తూ.. `అందమైన పడుచుపిల్ల ఎంత మెరిసిపోతుందో చూడండి. నీపై చాలా ప్రేమ ఉంది ప్రియమైన కాజ్…సంతోషంగాను ఉంది. చాలా చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను` అంటూ పేర్కొంది. ఇక స‌మంత చేసిన ఈ వ్యాఖ్య‌ల‌తో తాను గర్భధారణకు వ్యతిరేకి కాద‌ని చెప్ప‌క‌నే చెప్పిసింది.