Samantha: అక్కినేని కాంపౌండ్‌లో ప్ర‌త్య‌క్ష‌మైన స‌మంత‌.. ఎందుకిలా?

Samantha: సీక్రెట్‌గా ప్రేమాయాణం న‌డిపిన స‌మంత నాగ చైత‌న్య మూ సంవ‌త్స‌రాల‌కే విడాకులు తీసుకున్నారు. మంచి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఇప్పుడు ఇద్ద‌రు వారి వారి ప‌నుల‌తో బిజీ అయ్యారు. విడాకుల ప్రకటన అనంతరం అటు సమంత, ఇటు నాగ చైతన్య అందరి దృష్టిని ఆక‌ర్షిస్తూ వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్నారు.

TheNewsQube-
samantha came to anapura studio
samantha came to anapura studio

గత కొద్ది రోజులుగా సామ్ సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటుంది. లెటేస్ట్ ఫోటోస్‏ షేర్ చేస్తూ అభిమానులకు టచ్‏లో ఉంటుంది. అయితే సామ్… చైతన్య విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఏంటీ అనేది మాత్రం ఇప్పటికీ తెలియలేదంటున్నారు నెటిజన్స్. ఇక తాజాగా విడాకుల ప్రకటన అనంతరం ఇన్ని రోజుల తర్వాత సమంత మరోసారి అక్కినేని కాంపౌండ్‏లో అడుగుపెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‏గా మారింది.

అక్కినేని వారి అన్నపూర్ణ స్టూడియోస్‌కి వెళ్లిందట సమంత. అయితే పర్సనల్‌గా కాకుండా ప్రొఫెషనల్‌గానే ఈ విజిట్ చేసిందని సమాచారం. కారులో నేరుగా అన్నపూర్ణ స్టూడియోస్‌కి చేరుకున్న సమంత.. ముఖంపై ముసుగుతో దిగి పని పూర్తి చేసుకొని వెళ్లిపోయిందట.

ఇంతకీ సమంతకి అక్కడ ఏం పని అంటారా? ఇటీవలే ‘శాకుంతలం’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన సమంత.. ఈ సినిమా డబ్బింగ్ పనుల కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌కి రావలసి వచ్చిందట. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతున్నాయి.

samantha came to anapura studio1
samantha came to anapura studio1

నాగ చైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌కి సమంత రావడం ఇదే తొలిసారి కాబట్టి ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ఇదిలా ఉంటే… నాగచైతన్య పుట్టినరోజున సామ్ విషెస్ చేయకుండా.. తన కుక్క పిల్లకు బర్త్ డే వేడుకలు జరపడం పై చై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు పర్సనల్ విషయాలు, ప్రొఫెషనల్ విషయాల్లో సమంత చూపిస్తున్న వేరియేషన్స్, దూసుకుపోతున్న తీరు పలువురి మన్ననలు పొందుతోంది. ప్రస్తుతం సమంత చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీలో ఐటెం సాంగ్‌‌తో హుషారెత్తించబోతోంది. వీటితో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు కూడా సిద్దమవుతోందట సామ్.