SAMANTHA:34వ బ‌ర్త్‌డే జ‌రుపుకుంటున్న స‌మంత‌.. వైర‌ల్‌గా మారిన ఫొటోలు

సమంత .. ఈ పేరుకి ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. అందంతో పాటు అభిన‌యంతో మేటి అనిపించుకున్న స‌మంత అతి త‌క్కువ స‌మ‌యంలో స్టార్ స్టేట‌స్ పొందింది. తెలుగులోనే కాదు త‌మిళంలోను అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన ఈ ముద్దుగుమ్మ‌ అక్కినేని నాగ చైతన్య‌ను వివాహం చేసుకున్న త‌ర్వాత కేవ‌లం లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేసేందుకు ఎక్క‌వ‌గా ఆస‌క్తి చూపిస్తుంది. ప్ర‌స్తుతం గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శకుంత‌లం అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజుల క్రితం ప్రారంభం కాగా, క‌రోనా సెకండ్ వేవ్ వ‌ల‌న బ్రేక్ ప‌డ్డ‌ట్టు తెలుస్తుంది.

స్టార్ స్టేట‌స్ పొందిన స‌మంత ఈ రోజు 34వ బ‌ర్త్ డే జ‌రుపుకుంటున్న సంద‌ర్బంగా అభిమానులు రెండు రోజుల ముందు నుండే హ‌డావిడి చేస్తున్నారు. తమన్నా కామ‌న్ బర్త్ డే సీడీపీ రిలీజ్ చేయ‌గా, ఇందులో సౌత్ క్వీన్ అంటూ అర్ధం వచ్చేలా సీడీపీని క్రియేట్ చేశారు. అలాగే సౌత్ రాజ్యానికి సామ్ ను క్వీన్ లా చూపిస్తూనే సీడీపీలో ఆమె నిర్వహిస్తున్న స్వచ్చంద సంస్థలు(pratyusha ekam) మెన్షన్ చేశారు. ఈ కామ‌న్ డీపి అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది. మ‌రోవైపు స‌మంత త‌న మేనేజ‌ర్‌తో క‌లిసి బ‌ర్త్‌డే వేడుక జ‌రుపుకోగా, ఈ ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Advertisement