Samantha And Vijay Thalapathy : విజయ్ పాలిట విలన్ గా మారిన సమంత?
NQ Staff - July 24, 2022 / 11:58 AM IST

Samantha And Vijay Thalapathy : కొంతకాలంగా అటు తన సినిమాలతోనూ, ఇటు వివాదాలతోనూ వార్తల్లో ఉంటోంది సమంత. సోషల్‌మీడియాలోనూ హాట్ కామెంట్స్ తో, ఘాటు రిప్లయ్స్ తో ఇష్యూలకు ఊ అంటోందే తప్ప ఊఊ అనడం లేదు. ప్రజెంట్ మరో బజ్ తో నెటిజన్ల మధ్య హాట్ టాపిక్ గా మారిందీ వెండితెర శకుంతల.
లోకేష్ కనగరరాజ్ డైరెక్షన్లో

Samantha as Vijay Thalapathy Villain Lokesh Kanagaraj Direction
కోలీవుడ్ హీరో విజయ్ త్వరోలనే ఓ చిత్రంలో నటించనున్నాడు. ‘మాస్టర్’ కాంబో మరోసారి రిపీట్ కానుండడంతో దళపతి ఫ్యాన్స్ తెగ ఎగ్జయింటింగ్ గా ఉన్నారు ఈ ప్రాజెక్ట్ కోసం. ఈ అప్ కమింగ్ హైప్ మరింత పెంచేలా వినిపిస్తోన్న మరో లేటెస్ట్ టాక్ ఏంటంటే.. సమంత ఇందులో నెగిటివ్ రోల్ చేయనుందట. ఈ గాసిప్ ఇంత స్ట్రాంగ్ గా వినిపించడానికి కూడా రీజన్ లేకపోలేదు. ఎందుకంటే గతంలోనూ సామ్ నెగిటివ్ పాత్రల్లో నటించి తన వర్సటాలిటీని ప్రూవ్ చేసుకుంది.

Samantha as Vijay Thalapathy Villain Lokesh Kanagaraj Direction
విక్రమ్ హీరోగా వచ్చిన ’10 ఎండ్రాతుకుల్లా’ మూవీలో డ్యూయల్ రోల్ చేసింది సమంత. అందులో ఒకటి హీరోయిన్ క్యారెక్టర్, మరొకటి నెగిటివ్ క్యారెక్టర్. ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ సాధించకపోయినా సామ్ డిజప్పాయింట్ కాలేదు.
స్టార్ హీరోయన్ గా సౌత్ మొత్తంలోనూ తన హవాని సక్సెస్ ఫుల్ గా కంటిన్యూ చేస్తున్న టైమ్ లోనే, ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ‘ఫ్యామిలీ మ్యాన్ టూ’ సిరీస్ లో నెగిటివ్ రోల్ చేసి ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేయడంతో పాటు క్రిటిక్స్ నుంచి అప్రిసియేషన్స్ దక్కించుకుంది. కంటెంట్ అండ్ క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా ఉంటే కెరీర్ పరంగా ఎంత రిస్కయినా చేయడానికి రెడీ అని నిరూపించుకుంది.

Samantha as Vijay Thalapathy Villain Lokesh Kanagaraj Direction
ఇక విక్రమ్ మూవీతో నేషన్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన లోకేష్ కనగరాజ్ ప్రజెంట్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. మరోవైపు తనకు నేరేట్ చేసిన స్టోరీకి ఫిదా అయిన మధురవాణి మరోసారి దళపతి విజయ్ మూవీలోనూ నెగిటివ్ రోల్ చేసేందుకు ఆసక్తి చూయిస్తోందట.
ఇక్కడ మరో ఇంట్రస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే.. విజయ్, సమంత కలిసి కోలీవుడ్‌లో హీరో హీరోయన్లుగా మూడు చిత్రాల్లో నటించారు. కత్తి, తెరీ(పోలీసోడు), మెర్సల్(అదిరింది) సినిమాల్లో విజయ్ కు జోడీగా నటించింది సామ్. అన్నీ కమర్షియల్ గా సక్సెస్ టాక్ తెచ్చుకున్న చిత్రాలే. అలాంటిది ఇప్పుడు అదే విజయ్ తో నెగిటివ్ పాత్రలో స్క్రీన్ షేర్ చేసుకోనుందన్నమాట. అయితే ఈ మ్యాటర్ పై మూవీ టీమ్ నుంచి అఫీషియల్ గా క్లారిటీ రావాల్సి ఉంది.

Samantha as Vijay Thalapathy Villain Lokesh Kanagaraj Direction
కొంతకాలంగా తన సినిమాల ఎంపిక విషయంలో సమంత రొటీన్ గా థింక్ చేయట్లేదు. కమర్షియల్ సినిమాల్లో హీరోకి పెయిర్ గా యాక్ట్ చేసి డ్యూయెట్స్ లో ఆడి పాడడమే కాకుండా, స్పెషల్ సాంగ్స్ తోనూ సిల్వర్ స్క్రీన్ పై మెరుస్తోంది. క్యారెక్టరైజేషన్ బాగుంటే డ్యూరేషన్ ని కూడా పెద్దగా కన్సిడర్ చేయట్లేదు. అదే ఫ్లోలో నెగిటివ్ రోల్ అయినా కూడా వెనక్కి తగ్గడం లేదు. సో.. అన్నీ ప్రాపర్ గా వర్కవుట్ అయితే లోకేష్ డైరెక్షన్లో విజయ్ కి విలన్ గా జెస్సీ సిల్వర్ స్క్రీన్ పై మెరవనుందన్నమాట.