Samantha: మల్టీ టాలెంటెడ్ హీరోయిన్‌గా సమంత .. అంద‌రికి ఆద‌ర్శ‌మ‌వుతున్న రాజీ

Samantha: సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఎంతో పేరు సంపాదించుకుంది సమంత. ఏం మాయ చేశావే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సామ్ ఇప్పుడు నంబర్ వన్ స్టార్ గా ఎదిగింది. తన టాలెంట్ తో పాటు అదృష్టాన్ని కూడా పరీక్షించుకుంది. ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోయే తత్వం. ఇచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేయగలిగిన నటి. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చాక కెరీర్ స్టార్టింగ్ నుండి విలక్షణమైన, విభిన్నమైన కథలున్న సినిమాల్లో నటించారు.

తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. రీసెంట్ గా డిజిటల్ మీడియాలోకి కూడా అడుగుపెట్టింది సమంతా. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో నేషనల్ వైడ్ గా ఎంతో క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. రాజీ అనే తమిళ్ ఈలం సోల్జర్ గా అద్భుతంగా నటించి ఎంతోమంది ప్రశంసలు దక్కించుకుంది సామ్.

ఈమె మెయిన్ లీడ్ రోల్ లో శాకుంతలం అనే ఫాంటసీ సినిమాలో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది. సమంత అక్కినేని ఇంటికి కోడలైంది. పెళ్ళి తర్వాత కూడా ఎన్నో పాత్రల్లో, హీరోయిన్ గా అద్భుతంగా రాణిస్తోంది. ఎంతోమంది నటీమణులకు సామ్ ఆదర్శంగా నిలుస్తుంది. అక్కినేని వారింట గౌరవాన్ని కాపాడుతూనే, ఓ భార్య గా తన పర్సనల్ లైఫ్ ని లీడ్ చేస్తూ.. తన కెరీర్ ని ప్రొఫెషనల్ గా బ్యాలెన్స్ చేయడం వెనుక ఎంతో కృషి, పట్టుదల, తపన ఉన్నాయి.

అయితే వాటితో పాటు నాగచైతన్య ఫుల్ సపోర్ట్ కూడా ఉంది. సామ్ మల్టీ టాలెంటెడ్ హీరోయిన్. తాను సినిమాలు చేస్తూనే ప్రత్యుష ఫౌండేషన్ తో సేవా కార్యక్రమాలు చేస్తుంది. అలాగే బిజినెస్ ఉమన్ గా కూడా రాణిస్తోంది. సమంత రీసెంట్ గా సాకీ అనే బ్రాండ్ నేమ్ తో గార్మెంట్ బిజినెస్ ని రన్ చేస్తుంది. సమంత అక్కినేని లో మొదటి అక్షరాలను తీసుకుని సాకీ అనే పేరు పెట్టుకున్నట్లు తెలుస్తుంది.

చిన్న పిల్లలకు, ఎంతోమంది మహిళలకు అండగా నిలిచేందుకు ప్రత్యూష ఫౌండేషన్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తోంది. ఇంకా ఏకం అనే స్కూల్ ని నడుపుతుంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ కూడా సమంతానే. ప్రతిభతో పాటు అదృష్టం అంటే సమంతదే అనేలా క్రేజ్ సంపాదించుకుంది అక్కినేని వారి కోడలు. రీసెంట్ గా చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020 టైటిల్ ను సాధించారు.